లాభాల్లో దుమ్మురేపిన HDFC బ్యాంక్

by Harish |   ( Updated:2023-10-17 04:53:57.0  )
లాభాల్లో దుమ్మురేపిన HDFC బ్యాంక్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రైవేట్ దిగ్గజ బ్యాంక్ HDFC సోమవారం తన రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి బ్యాంక్ సంవత్సరానికి రూ.15,976 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ విలీనం అయిన తర్వాత వెలువడిన మొదటి ఫలితాలు. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 30.27 శాతం పెరిగి రూ. 27,385.23 కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో ఇది రూ.21,021.16 కోట్లుగా ఉంది.

నికర ఆదాయం సంవత్సరానికి 114 శాతం పెరిగి రూ.66,317 కోట్లకు చేరుకుంది. మొత్తం డిపాజిట్లు సంవత్సరానికి 29.8 శాతం వృద్ధి చెంది రూ. 21,72,858 కోట్లకు చేరాయి. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు (NPA) నిష్పత్తి సమీక్ష కాలంలో 1.34 శాతానికి పెరిగింది, ఇది క్రితం ఏడాది 1.23 శాతంగా ఉంది.

2023 జులైలో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తనలో విలీనం చేసుకుంది. ఇది భారతదేశ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద విలీనం. ఈ విలీనంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రపంచంలోనే మార్కెట్ విలువ పరంగా నాలుగో అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది.

Advertisement

Next Story

Most Viewed