Harsh Goenk: ఓలాకు అండగా నిలిచిన హర్ష్ గోయెంకా.. సీఈఓ భవిష్ అగర్వాల్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-09 14:28:34.0  )
Harsh Goenk: ఓలాకు అండగా నిలిచిన హర్ష్ గోయెంకా.. సీఈఓ భవిష్ అగర్వాల్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ విద్యుత్ వాహన(Electric Vehicle) తయారీ కంపెనీ ఓలా(Ola) గత కొన్ని రోజులుగా పలు వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. కస్టమర్లను మోసగించే ప్రకటనలు, హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై ఇటీవలే ఆ సంస్థకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA) షోకాజ్ నోటీసులు జారీ చేసింది.ఇదిలా ఉంటే..కొన్ని రోజుల క్రితం హాస్యనటుడు కునాల్ కమ్రా(Comedian Kunal Kamra), ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్(Ola CEO Bhavish Agarwal) మధ్య ఆన్‌లైన్ లో మాటల యుద్ధం నడిచింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు, ప్రతి కామెంట్లతో మాటల దాడి చేసుకున్నారు. ఓలా సర్వీస్ సెంటర్ వెలుపల పెద్ద సంఖ్యలో పోగైన ఓలా స్కూటర్ల ఫోటోను కమ్రా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇరువురి మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది. ఓలా స్కూటర్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియాజేస్తూ కమ్రా షేర్ చేసిన పోస్ట్ కు ఇది పెయిడ్ పోస్ట్ అని అగర్వాల్ రిప్లై ఇవ్వడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్(RPG Group Chairman) హర్ష్ గోయెంకా(Harsh Goenka) అండగా నిలిచారు. ఈ మేరకు ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ ను ట్యాగ్ చేస్తూ 'ఎక్స్(X)'లో పోస్ట్ చేశారు. తాను తక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తే ఓలా స్కూటర్ (Ola scooter)నే వినియోగిస్తానని, ఒక 'కమ్రా(ఇంటి గది)' నుంచి మరో ఇంటి గదికి చేరుకోవాలనుకుంటే ఓలా స్కూటర్ పైనే వెళ్తానని ట్వీట్ చేశారు.తన ట్వీట్ లో కమ్రా పేరుతో అర్థం వచ్చేలా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో హర్ష్ గోయెంకా ఓలాకు అండగా నిలబడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Advertisement

Next Story