- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
5 కోట్ల కంటే ఎక్కువ పన్ను ఎగవేతల్లో జీఎస్టీ అధికారులే విచారణ మొదలుపెట్టొచ్చు: ఆర్థిక శాఖ!
న్యూఢిల్లీ: ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎగవేత లేదా దుర్వినియోగం మొత్తం రూ. 5 కోట్ల కంటే ఎక్కువ ఉంటే జీఎస్టీ అధికారులే నేరుగా విచారణ ప్రారంభించవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ పరిమితి మొత్తం తరచుగా ఇటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడే వారికి వర్తిస్తుందని, సరైన ఆధారాలు ఉన్నట్లు ఋజువైతే విచారణ మొదలుపెట్టవచ్చని తేల్చి చెప్పింది. విచారణ గనక ప్రారంభమైతే నేరం చేసిన వ్యక్తిపై న్యాయపరమైన ప్రక్రియ మొదలైనట్టుగా భావించవచ్చని జీఎస్టీ దర్యాప్తు విభాగం పేర్కొంది.
గత రెండేళ్ల కాలంలో రెండు అంతకంటే ఎక్కువ సందర్భాల్లో మోసపూరిత చర్యల వల్ల పన్ను చెల్లింపుదారులు లేదా కంపెనీలు రూ. 5 కోట్ల కంటే ఎక్కువ లబ్దిని పొందినట్లుగా తేలితే 'తరచుగా ఎగవేతలను పాల్పడిన వారుగా' పరిగణించాలని ఆర్థిక శాఖ తాజా ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ వివరాల కోసం డిజిట్ డేటాబేస్‌ను వినియోగించాలని, విచారణ సమయంలో అరెస్ట్ చేసి, బెయిల్ అందకపోతే 60 రోజుల్లోగా ప్రాసిక్యూషన్ ఫిర్యాదును కోర్టుకు అందజేయాలని ఆదేశాలిచ్చింది. విచారణను నేర తీవ్రత, ఎగవేత మొత్తం, మోసపూరిత చర్య వంటి పలు అంశాల ఆధారంగా ప్రారంభించాలని, ఇందులోనూ స్పష్టమైన ఆధారాలను సేకరించడం కీలకమని వెల్లడించింది.
Also Read : లాభనష్టాల మధ్య ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు!