Budget-2025: వినియోగాన్ని పెంచేందుకు ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే యోచనలో ప్రభుత్వం

by S Gopi |
Budget-2025: వినియోగాన్ని పెంచేందుకు ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే యోచనలో ప్రభుత్వం
X

దిశ, బిజినెస్ బ్యూరో: మరో రెండు వారాల్లో కేంద్ర బడ్జెట్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే సామాన్యులు తమకోసం అనుకూల నిర్ణయాలు ఉంటాయని ఆశిస్తున్నారు. ముఖ్యంగా వేతనజీవులు ఈసారి బడ్జెట్‌లో ఊరటనిచ్చే ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు. గత ఏడాది కాలంగా ఖర్చులు పెరగడం, అధిక ద్రవ్యోల్బణం ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో అందుకు తగిన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేలా నిర్ణయాన్ని ప్రకటించే ఉద్దేశం ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వ్యవస్థంలో తగ్గిన వినియోగాన్ని పెంచేందుకు ఫిబ్రవరి 1న వెలువడే బడ్జెట్‌లో ఏడాదికి రూ. 15 లక్షల వరకు ఆదాయం ఉన్న వారిపై ఆదాయపు పన్ను తగ్గించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్టు రాయిటర్స్ పేర్కొంది. దీనివల్ల 10 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం ఉంటుంది. ఇటీవల భారత వృద్ధి నెమ్మదించిన కారణంగా దేశంలో వినియోగం పెంచడం ద్వారా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని, తద్వారా జీఎస్టీ సహా ఇతర పన్నుల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం పలు అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. అందులో స్తాండర్డ్ డిడక్షన్‌ను గతేడాది రూ. 75 వేలకు పెనగా, ఇప్పుడు దీన్ని మరింత పెంచే అంశాన్ని సమీక్షిస్తోంది. ఇది కాకుంటే, 20 శాతం పన్ను పరిధిలో ఉన్న రూ. 12-15 లక్షల శ్లాబ్‌ను రూ. 12-18 లేదా రూ. 12-20 లక్షలకు మార్చాలని భావిస్తోంది.

Next Story

Most Viewed