గూగుల్ మ్యాప్‌పై ఆధారపడి ప్రయాణం కొనసాగిస్తున్నారా.. అయితే మీకే ఈ గుడ్ న్యూస్!

by Aamani |
గూగుల్ మ్యాప్‌పై ఆధారపడి ప్రయాణం కొనసాగిస్తున్నారా.. అయితే మీకే ఈ గుడ్ న్యూస్!
X

దిశ, వెబ్‌డెస్క్ : గూగుల్ మ్యాప్స్ పై కొన్ని వేలమంది ఆధారపడి ప్రయాణాలను కొనసాగిస్తుంటారు.అందుకోసమని గూగుల్ తన ఇండియా మ్యాప్స్ కు ఆరు కొత్త అంశాలు ప్రవేశపెట్టింది.ఈ ఫీచర్లు ఫోర్ వీలర్ వాహనాలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని తెలిపింది. భారతదేశంలో మొత్తం 6 కొత్త ఫీచర్లను రిలీజ్ చేసినట్లు చెప్పుకొచ్చింది. వాటిలో ఫ్లై ఓవర్ అలర్ట్, ఈవి ఛార్జింగ్ స్టేషన్ సమాచారం, మెట్రో టికెట్, ట్రాఫిక్ నివేదిక, ప్రముఖ ప్రదేశాల పేర్లు కలవు. ఇంతే కాక రూటింగ్ ఆల్గోరిథమ్స్ ద్వారా ఇరుకు దారులు, ఫోర్ వీలర్స్ వెళ్ళలేని దారులను కూడా తెలుపబోతుందట. అయితే మొదట కొత్త మ్యాప్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లలో తీసుకువచ్చి,ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు.



Next Story