- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కష్టమర్స్‌కు గోల్డెన్ న్యూస్.. మిస్డ్ కాల్‌తో మొబైల్‌కే బంగారం ధరలు
దిశ, వెబ్‌డెస్క్: మగువలకు బంగారం అంటే ఎంతో ఇష్టం. పండుగ వచ్చినా పబ్బం వచ్చినా.. సందర్భం ఏదైనా మొదట వారు గోల్డ్‌కే ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసేందుకు డైలీ ధర తగ్గుతుందో లేదో అని ఎదురుచూస్తుంటారు. దీంతో ఏరోజకారోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయా అని వివిధ సైట్‌లలో చెక్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) కస్టమర్లకు ఓ శుభవార్త తెలిపింది.
IBJA అనేది దేశంలోని పసిడి వ్యాపారుల సమస్యల పరిష్కారం కోసం 1919లో ఏర్పాటైన సంస్థ. దేశంలోని అన్ని బులియన్, జ్యువెలరీ అసోసియేషన్‌లకు దీన్ని అపెక్స్ అసోసియేషన్‌గా పరిగణిస్తారు. ఇది రోజూ ఉదయం, సాయంత్రం రెండు సార్లు అప్పటికి ఉన్న బంగారం ధరలను ప్రచురిస్తుంది. ఈ క్రమంలోనే బంగారం ధర ఎంత ఉందో తెలియాలంటే IBJA కు సంబంధించిన 8955664433 నెంబర్‌కు ఒక్క మిస్ట్ కాల్ ఇస్తే చాలు.. ఆ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో మెసేజ్ ద్వారా వెంటనే మొబైల్‌కు వస్తుంది. దాంతో పాటు మరిన్ని వివరాలు తెలియాలంటూ IBJA అధికారిక వెబ్‌సైట్ కూడా సందర్శించవచ్చు.
- Tags
- gold price