ఒక్కరోజే రూ. 720 తగ్గిన బంగారం!

by Harish |   ( Updated:2023-03-08 14:03:55.0  )
ఒక్కరోజే రూ. 720 తగ్గిన బంగారం!
X

హైదరాబాద్: దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. విదేశీ మార్కెట్లలో పసిడి దిగి రావడంతో దేశీయంగా కూడా ఆ ప్రభావం కనబడింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అరికట్టేందుకు గతంలో కంటే ఎక్కువ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలున్నాయని యూఎస్ ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యానించడంతో బంగారం బలహీనపడి, ఒక వారం కనిష్ఠానికి పడిపోయాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌కు చెందిన కమొడిటీస్ సీనియ అనలిస్ట్ సౌమిల్ గాంధీ ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం బుధవారం రోజున ఏకంగా రూ. 720 తగ్గి రూ. 55,630 వద్ద ఉంది. అలాగే, ఆభరణాల తయారీ వాడే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ. 650 తగ్గి రూ. 51 వేలకు దిగొచ్చింది. పసిడి తరహాలోనే వెండి కూడా కిలోకు రూ. 2,500 క్షీణించి రూ. 67,500కి పరిమితమైంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1814 డాలర్లుగా ఉంది. వెండి ఔన్సు 20.05 వద్ద ఉంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ఆభరణాల్లో వినియోగించే 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో రూ. 51,150 ఉండగా, ఆర్థిక రాజధాని ముంబైలో రూ. 51 వేలు, చెన్నైలో రూ. 51,620, కోల్‌కతాలో రూ. 51 వేలు, బెంగళూరులో రూ. 51,050గా ఉంది.

Also Read..

మహిళలకు ప్రత్యేకంగా అధిక వడ్డీని అందించే పొదుపు పథకాలు!

Advertisement

Next Story

Most Viewed