- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
FSSAI: పాలు, పాల ఉత్పత్తులపై ఏ1, ఏ2ల తొలగింపును ఉపసంహరించుకున్న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ
by S Gopi |
X
దిశ, బిజినెస్ బ్యూరో: పాలు, పాల ఉత్పత్తుల ప్యాకేజింగ్‌లపై ఏ1, ఏ2 రకాల క్లెయిమ్‌లకు సంబంధించి తొలగింపు నిర్ణయాన్ని ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఉపసంహరించుకుంటున్నట్టు సోమవారం తెలిపింది. గతవారం ఆయా ప్యాకేజీలపై ఏ1, ఏ2 రకాలను క్లెయిమ్ చేయడం వినియోగదారులను తప్పుదోవ పట్టించడమవుతుంది. కాబట్టి వాటిని తొలగించాలని ఈ-కామర్స్ కంపెనీలు, ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు(ఎఫ్‌బీఓ)లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి సంప్రదింపులు జరిపేందుకు ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నామని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. కాబట్టి ఎఫ్‌బీఓలు తమ పాలు, పాల ఉత్పత్తులాఇ ఏ1, ఏ2 క్లెయిమ్‌లతో క్రయవిక్రయాలను కొనసాగించవచ్చని పేర్కొంది. ఏ1, ఏ2 రకాలు పాలలోని బీటా కేసిన్ ప్రొటీన్ నిర్మాణంలో తేడాను సూచించేవి మాత్రమే. ప్రస్తుత ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలు వీటిని గుర్తించడం లేదు.
Advertisement
Next Story