- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
FPIs: రికార్డు స్థాయిలో రూ. 94 వేల కోట్లు ఉపసంహరించుకున్న విదేశీ ఇన్వెస్టర్లు
దిశ, బిజినెస్ బ్యూరో: విదేశీ పెట్టుబడిదారులు అక్టోబర్‌లో భారత స్టాక్ మార్కెట్ల నుంచి రికార్డు స్థాయిలో రూ. 94,000 కోట్ల నిధులను వెనక్కి తీసుకున్నారు. భారత ఈక్విటీల్లో వాల్యుయేషన్‌లు ప్రీమియం కావడం, చైనా మార్కెట్లలో షేర్లు ఆకర్షణీయంగా ఉన్న కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ల నుంచి నిధులు ఉపసంహరించుకున్నారు. 2020, మార్చిలో ఉపసంహరించుకున్న రూ. 61,973 కోట్లు ఇప్పటివరకు అత్యధికం. డిపాజిటరీ గణాంకాల ప్రకారం.. అక్టోబర్‌లో ఎఫ్‌పీఐలు మొత్తం రూ. 94,017 కోట్ల నిధులను వెనక్కి తీసుకున్నారు. అక్టోబర్‌లో భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ నిధులు ఇంత భారీగా ఉపసంహరించుకోవడానికి అనేక అంశాలు దోహదం చేశాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్-మేలో రూ. 34,252 కోట్ల నిధులను వెనక్కి తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) మొత్తంగా జనవరి, ఏప్రిల్, మే మినహా అన్ని నెలల్లో షేర్ల విక్రయానికి మొగ్గుచూపారు. ప్రధానంగా భౌగోళిక రాజకీయ పరిణామాలు, వడ్డీ రేట్లు, చైనా ఆర్థికవ్యవస్థ పుంజుకోవడం, అమెరికా ఎన్నికల వంటి అంశాలు విదేశీ మదుపర్లను ప్రభావితం చేశాయి. రానున్న రోజుల్లో ఈ అంశాలు భారత ఈక్విటీలకు కీలకంగా ఉండనున్నాయని మార్కెట్ నిపుణులు వెల్లడించారు.