భారత మార్కెట్లోకి మళ్లీ తిరిగొస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు

by Harish |
భారత మార్కెట్లోకి మళ్లీ తిరిగొస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొంత కాలంగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు కారణంగా దేశీయ మార్కెట్లో విదేశీ పెట్టుబడి దారుల నుంచి పెట్టుబడులు భారీగా తగ్గాయి. గత మూడు నెలల కాలంలో ఎక్కువగా అమ్మకాలకు దిగారు. అయితే తాజాగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) భారత ఈక్వీటి మార్కెట్లో తిరిగి తమ కొనుగోళ్లను ఎక్కువగా జరుపుతున్నారు. దీంతో గత ఆరు సెషన్‌లలో ఎఫ్‌ఐఐ పెట్టుబడులు దేశీయ మార్కెట్లోకి భారీగా పెరిగాయి. దీంతో బెంచ్‌మార్క్ నిఫ్టీ 50ని ఆల్‌రౌండ్ కొనుగోళ్లపై డిసెంబర్ 1 శుక్రవారం ఇంట్రాడే సెషన్‌లో 20,291.55 తాజా రికార్డు స్థాయిని తాకింది.

ఎఫ్‌ఐఐలతో పాటు దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DIIలు) భారత స్టాక్‌లలో తమ ఇన్వెస్ట్‌మెంట్లను పెంచుతున్నారు. NSE డేటా ప్రకారం, FIIలు రూ.10,522.36 కోట్ల భారతీయ ఈక్విటీలను కొనుగోలు చేయగా వారు రూ. 8,932.75 కోట్ల అమ్మకాలను జరపారు. దీంతో, మొత్తం ఇన్‌ఫ్లో రూ.1,589.61 కోట్లుగా ఉంది. DIIలు రూ.11,173.05 కోట్లు పెట్టుబడి పెట్టగా, వారు రూ. 9,724.97 కోట్ల అమ్మకాలను జరపగా, మొత్తం ఇన్‌ఫ్లో రూ.1,448.08 కోట్లుగా ఉంది. భారత్ వృద్ధి రానున్న రోజుల్లో మరింత పెరగడం, బలమైన ఆర్థిక డేటా, ఆరోగ్యకరమైన కార్పొరేట్ ఆదాయాలు మొదలగు కారణాల వలన భారత మార్కెట్లోకి పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

Advertisement

Next Story