FDI: రూ. లక్ష కోట్ల డాలర్ల కీలక మైలురాయి దాటిన ఎఫ్‌డీఐ పెట్టుబడులు

by S Gopi |
FDI: రూ. లక్ష కోట్ల డాలర్ల కీలక మైలురాయి దాటిన ఎఫ్‌డీఐ పెట్టుబడులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత మార్కెట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు బాగా కలిసొచ్చింది. గడిచిన దాదాపు రెండున్నర దశాబ్దాల కాలంలో అంతర్జాతీయంగా ఇతర మార్కెట్లతో పోలిస్తే భారత్ సురక్షితమైన, కీలకమైన పెట్టుబడులకు కేంద్రంగా భారత్ నిలిచిందని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) గణాంకాలు తెలిపాయి. 2000, ఏప్రిల్-2024 సెప్టెంబర్ మధ్య భారత ఎఫ్‌డీఐ పెట్టుబడులు రూ. లక్ష కోట్ల డాలర్ల(రూ. 84.67 లక్షల కోట్ల) కీలక మైలురాయిని అధిగమించాయి. డీపీఐఐటీ డేటా ప్రకారం, సమీక్షించిన కాలంలో ఈక్విటీలతో పాటు రీ-ఇన్వెస్ట్‌మెంట్ ఆదాయాలు, ఇతర నిధుల ద్వారా ఎఫ్‌డీఐల మొత్తం విలువ 1.0334 ట్రిలియన్ డాలర్లు( రూ. 87.50 లక్షల కోట్లు)గా ఉన్నాయి. మొత్తం ఎఫ్‌డీఐల్లో 25 శాతం మారిషస్ నుంచి రాగా, ఆ తర్వాత సింగపూర్ (24 శాతం), అమెరికా (10 శాతం), నెదర్లాండ్స్ (7 శాతం), జపాన్ (6 శాతం), యూకే (5 శాతం), యూఏఈ (3 శాతం), కేమన్ దీవులు, జర్మనీ, సైప్రస్‌లు ఒక్కొక్కటి 2 శాతంగా పెట్టుబడులు పెట్టాయి. ఈ పెట్టుబడులు ముఖ్యంగా సేవల విభాగం, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్, టెలికమ్యూనికేషన్స్, ట్రేడింగ్, కన్‌స్ట్రక్షన్ డెవలప్‌మెంట్, ఆటోమొబైల్, కెమికల్స్, ఫార్మా రంగాల్లోకి వచ్చాయి. గడిచిన దశాబ్ద కాలలోనూ ఎఫ్‌డీఐల పెరుగుదల అత్యంత వేగంగా ఉంది. 2014-24 మధ్య ఇవి 119 శాతం పెరిగాయి. ముఖ్యంగా తయారీలో 69 శాతం ఎఫ్‌డీఐ పెట్టుబడులు వచ్చి చేరాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పాలసీ విధానాలు, ఇతర అంశాల కారణంగా విదేశీ పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయ కేంద్రంగా మార్చాయి.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story