FDIs: ఏప్రిల్-జూన్‌లో దాదాపు 50 శాతం పెరిగిన ఎఫ్‌డీఐలు

by S Gopi |
FDIs: ఏప్రిల్-జూన్‌లో దాదాపు 50 శాతం పెరిగిన ఎఫ్‌డీఐలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా పెరిగాయి. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) పెట్టుబడులు 47.8 శాతం పెరిగి 16.17 బిలియన్ డాలర్లకు(రూ. 1.36 లక్షల కోట్లు) చేరుకున్నాయి. ముఖ్యంగా ఈ పెట్టుబడులు సేవలు, సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్, టెలికాం, ఫార్మా, రసాయన రంగాల్లోకి అత్యధిక నిధులు వచ్చాయని డేటా పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో దేశంలోకి రూ. 92 వేల కోట్ల విలువైన ఎఫ్‌డీఐలు వచ్చాయి. అలాగే, ఈక్విటీ పెట్టుబడులు, రీ-ఇన్వెస్ట్ చేసిన ఆదాయం, ఇతర మూలధనం వంటి అన్ని రకాల ఎఫ్‌డీఐలు కలుపుకుంటే సమీక్షించిన త్రైమాసికంలో ఎఫ్‌డీఐలు 28 శాతం పెరిగాయి. ఇవి మారిషస్, సింగపూర్, యూఎస్, నెదర్లాండ్స్, యూఏఈ, కేమన్ దీవులు, సైప్రస్ సహా ప్రధాన దేశాల నుంచి అధికంగా వచ్చాయి. జపాన్, యూకే, జర్మనీ లాంటి దేశాల నుంచి ఎఫ్‌డీఐలు తగ్గాయి. మొదటి త్రైమాసికంలో అత్యధికంగా రూ. 72 వేల కోట్లతో మహారాష్ట్ర ఎక్కువ ఎఫ్‌డీఐలను సాధించింది. ఆ తర్వాత కర్ణాటక(రూ. 19.14 వేల కోట్లు), తెలంగాణ(రూ. 9 వేల కోట్లు), గుజరాత్(రూ. 8.56 వేల కోట్లు) వచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed