జనవరిలో రికార్డు స్థాయి ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు

by S Gopi |
జనవరిలో రికార్డు స్థాయి ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ వాహన పరిశ్రమలో ప్యాసింజర్ వాహనాల విభాగంలో గత నెలల రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. వాహన డీలర్ల సంఘం ఫాడా ఈ ఏడాది జనవరి నెలకు సంబంధించి విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడింది. ప్రధానంగా ఎస్‌యూవీలకు పెరిగిన భారీ డిమాండ్ కారణంగా గత నెల మొత్తం 3,93,250 యూనిట్ల ప్యాసింజర్ వాహనాల విక్రయాలు నమోదయ్యాయి. ఇది గతేడాది నమోదైన 3,47,086 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 13 శాతం పెరిగాయి. ముఖ్యంగా వాహన మార్కెట్లో కొత్త మోడళ్లు రావడం, పలు రకాల రాయితీ పథకాలు, పెళ్లిళ్ల సీజన్ రికార్డు స్థాయి అమ్మకాలు సహాయపడ్డాయని ఫాడా వెల్లడించింది. అమ్మకాలు ఈ స్థాయిలో పెరిగినప్పటికీ కార్ల కోసం వెయిటింగ్ పీరియడ్ ఇప్పటికీ 50 రోజులకు పైనే ఉందని ఫాడా పేర్కొంది. ఇక, మిగిలిన విభాగాలను పరిశీలిస్తే జనవరిలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు గతేడాది కంటే 15 శాతం పెరిగి 14.59 లక్షల యూనిట్లు విక్రయించబడ్డాయి. కమర్షియల్ వాహనాలు 89,208 యూనిట్లు, త్రీ-వీలర్ వాహనాల అమ్మకాలు 37 శాతం వృద్ధితో 97,675 యూనిట్లు, ట్రాక్టర్ అమ్మకాలు 21 శాతం పెరిగి 88,671 యూనిట్లు అమ్ముడయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed