- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో ఈపీఎఫ్ లావాదేవీలను బ్లాక్ చేసిన ఈపీఎఫ్ఓ
దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఆంక్షల నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంకుతో లింక్ చేసిన ఈపీఎఫ్ ఖాతాల్లోకి డిపాజిట్లు, క్రెడిట్లను బ్లాక్ చేయనున్నట్టు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ప్రకటించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(పీపీబీఎల్) ఖాతాలకు సంబంధించిన క్లెయిమ్‌లను అంగీకరించవచ్చని ఈపీఎఫ్ఓ తన ఫీల్డ్ ఆఫీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈపీఎఫ్ఓ ఖాతాలతో లింక్ అయిన చందరాదారులు క్లెయిమ్స్‌ను అనుమతించవద్దని, ఈ నిర్ణయం ఫిబ్రవరి 23వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని నోటీసుల్లో పేర్కొంది. గతేడాదే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకుల నుంచి ఈపీఎఫ్ పేమెంట్లకు అనుమతిస్తూ ఈపీఎఫ్ఓ ఆదేశాలిచ్చింది. ఇంతలోనే అనుమతులను రద్దు చేస్తూ ప్రకటించడం గమనార్హం. జనవరి 31న ఆర్‌బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్లు, వ్యాలెట్లు, ఫాస్టాగ్ లాంటి వాటిలో డిపాజిట్లకు, క్రెడిట్ లావాదేవీలకు నిరాకరిస్తూ ఆదేశాలిచ్చింది. దీన్ని అనుసరిస్తూ ఈపీఎఫ్ఓ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్ షేర్లు భారీగా పతనమవుతున్నాయి. షేర్ల పతనంతో సంస్థ వార్షిక లాభంలో భారీ నష్టాలు ఉంటాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సమయానికి కంపెనీ షేర్ ధర 6 శాతానికి పైగా నష్టపోయి రూ. 419.35 వద్ద ట్రేడవుతోంది.