EPFO: పాత రూల్‎కు ఈపీఎఫ్ఓ స్వస్తి.. ఇక నుంచి ప్రాసెస్ మరింత సులభం

by Vennela |
EPFO: పాత రూల్‎కు ఈపీఎఫ్ఓ స్వస్తి.. ఇక నుంచి ప్రాసెస్ మరింత సులభం
X

దిశ, వెబ్ డెస్క్ : EPFO: పీఎఫ్ ( ​​PF)ప్రాసెస్ ను మరింత సులభం చేసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్న ఈపీఎప్ఓ(EPFO)..తాజాగా మరొకొత్త నిర్ణయం తీసుకుంది. గతంలో పనిచేసిన ఉద్యోగులతోపాటు ప్రస్తుత కంపెనీకి ఉద్యోగి సమర్పించాల్సిన ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ క్లెయిమ్ రూల్స్(Online Transfer Claim Rules) ను తొలగించింది. ఈ మేరకు జనవరి 15న ఓ సర్క్యూలర్ జారీ చేసింది. ఉద్యోగులు ఉద్యోగాలు మారే సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న విషయం పై మాత్రం ఈపీఎఫ్ఓ(EPFO) క్లారిటీ ఇవ్వలేదు.

పాత రూల్స్ ఎత్తివేస్తే ఎవరు లాభం పొందుతారు?

అక్టోబర్ 1, 2017న లేదా ఆ తర్వాత యూఏఎన్ కేటాయించిన అదేవిధంగా యూఏఎన్(UAN) తో లింకై, ఆధార్(Aadhaar) తో లింకైన మెంబర్ ఐడీల మధ్య ఖాతా బదిలీలు. 2017 అక్టోబర్ 1వ తేదీ లేదా ఆ తర్వాత యూఏఎన్ లు కేటాయించిన పలు యూఏఎన్(Aadhaar) లతో లింక్ చేసిన మెంబర్ ఐడీల మధ్య బదీలీలు ఉంటాయి. 2017 అక్టోబర్ 1కి ముందు ఆధార్(Aadhaar) తో లింక్ చేసి ఉన్న పేరు, పుట్టిన తేదీ, జెండర్ ఒకే విధంగా ఉన్న అన్ని మెంబర్ ఐడీల మధ్య బదిలీ ఉంటుంది. 2017 అక్టోబర్ 1కి ముందు ఆధార్ తోత లింక్ చేసి ఉన్న పేరు, పుట్టిన తేదీ, జెండర్ ఒకేవిధంగా ఉన్న అన్ని మెంబర్ ఐడీల మధ్య బదిలీ ఉంటుంది.

యూఏఎన్(UAN) అంటే ఏమిటి?

ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ కు కంట్రిబ్యూషన్(Contribution) చేసే ప్రతి ఉద్యోగికి కేటాయించిన 12 అంకెల సంఖ్యను యూనివర్సల్ అకౌంట్ నెంబర్(Universal Account Number) లేదా యూఏఎన్ అంటారు. ఈ నెంబర్ ను ఈపీఓఫ్ఓEPFO) జారీ చేస్తుంది.

ఈపీఎఫ్ఓ పోర్టల్లో యూఏఎన్‎ను ఆధార్‎తో లింక్ ఎలా చేయాలి?

* ఈ-సేవ వెబ్ సైట్ కు వెళ్లి మీ యూఏఎన్ వివరాలతో మీ ఈపీఎఫ్ అకౌంట్ కి లాగిన్ అవ్వాలి.

*మేనేజ్ మెనూ కింద నో యువర్ కస్టమర్ (KYC)ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి.

* ఆధార్ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకుని మీ ఆధార్ డీటైయిల్స్ ఎంటర్ చేయండి.

* వివరాలన్నింటినీ సేవ్ చేసుకోండి.

*యూఐడీఏఐ డేటా ద్వారా ఆధార్ వివరాలు వెరిఫై అవుతాయి.

* కేవైసీ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత మీ ఆధార్ కార్డు మీ ఈపీఎఫ్ అకౌంట్ లింక్ అవుతుంది.

Next Story

Most Viewed