- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌లో తయారీ ప్లాంటు ఏర్పాటుపై ఎలన్ మస్క్ ప్రకటన!
శాన్‌ఫ్రాన్సిస్కో: గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలన్ మస్క్ భారత్‌లో ఉత్పత్తికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. తాము ఖచ్చితంగా భారత మార్కెట్లోకి వస్తామని, ఈ ఏడాది చివరి నాటికి ఫ్యాక్టరీ కోసం స్థలాన్ని ఎంపిక చేయనున్నామని మస్క్ ఓ ప్రకటనలో తెలిపారు. అమెరికాలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ప్రస్తుతానికి ఫ్యాక్టరీ కోసం స్థలాన్ని వెతికే పనిలో ఉన్నామని పేర్కొన్నారు.
గతవారమే టెస్లాకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు భారత ప్రభుత్వాధికారులతో చర్చలు నిర్వహించారు. ఉత్పత్తి ప్లాంటుతో పాటు ఆర్అండ్‌డీ కేంద్రాన్ని భారత్‌లో ఏర్పాటు చేయాలని టెస్లా భావిస్తోంది. అందులో భాగంగానే కంపెనీ అధికారులు ప్రభుత్వంతో చర్చలు నిర్వహించారు. ఇటీవల కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ సైతం భారత్‌లో ప్లాట్ ప్రారంభించేందుకు టెస్లా సిద్ధంగా ఉందన్నారు. ఉత్పత్తి, ఆవిష్కరణలకు భారత్ అత్యంత అనువైన దేశంగా టెస్లా భావిస్తోందని ఆయన వెల్లడించారు.
అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా టెస్లా వీలైనంత త్వరగా భారత్‌లో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తోంది. అమెరికా తర్వాత అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న చైనాకు ప్రత్యామ్నాయం భారత్ మాత్రమేనని, అందుకే ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Also Read..
ఒక్కరోజులో $4.38 బిలియన్ల సంపద.. తిరిగి టాప్ 20 బిలియనీర్ల జాబితాలోకి అదానీ