- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.2000 నోట్ల రద్దు ఎఫెక్ట్.. ఆర్బీఐ వెబ్‌సైట్ క్రాష్
దిశ, వెబ్‌డెస్క్: 2016 నవంబరు 8న రూ.500 పాత నోట్లను, రూ. 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఆ రోజునే రూ.500 కొత్త నోట్లను, రూ.2000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. కాకపోతే 2016 నవంబరు 10 నుంచి రూ. 2000 నోట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అవి అందుబాటులోకి వచ్చి సరిగ్గా ఆరున్నర ఏళ్ళు అయింది. ఇంతలోనే వాటిని వెనక్కి తీసుకునేంత అవసరం ఏం వచ్చింది ? అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో ఉదయిస్తోంది. దీనికి బదులిస్తూ శుక్రవారం ఆర్బీఐ స్పష్టమైన వివరణ ఇచ్చింది.
రూ. 2వేల నోట్లలో 89 శాతం 2017 మార్చికి ముందే చలామణిలోకి వచ్చాయని ఆర్బీఐ తన నోటిఫికేషన్‌లో తెలిపింది. వాటి లైఫ్ స్పాన్ (నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు) మాత్రమేనని.. అది త్వరలో పూర్తవుతుందని పేర్కొంది. 2016 నవంబర్‌లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసినప్పుడు వెంటనే రూ. 2,000 నోట్లను అందుబాటులోకి తెచ్చామని ఆర్బీఐ గుర్తు చేసింది. అప్పట్లో ప్రజల అవసరాలకు సరిపడా నగదును అతి తక్కువ కాలంలో అందుబాటులోకి తెచ్చే క్రమంలో రూ. 2,000 నోట్లను ప్రవేశపెట్టామని తెలిపింది. గత ఆరున్నర ఏళ్లలో ఇతర డినామినేషన్లు (ఇతర నోట్లు) సరిపడా అందుబాటులోకి వచ్చాయని, కాబట్టి రూ.2,000 నోటు అవసరం పూర్తయిందని ఆర్బీఐ స్పష్టం చేసింది. 2018- 19లోనే రూ.2,000 నోట్ల ముద్రణను నిలిపి వేసినట్టు వెల్లడించింది.
ఆర్బీఐ వెబ్‌సైట్ క్రాష్
రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం సాయంత్రం ప్రకటించిన కొద్దిసేపటికే ఆర్బీఐ వెబ్‌సైట్ క్రాష్ అయింది. దేశవ్యాప్తంగా కోట్ల మంది ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ ని సెర్చ్ చేయడంతో క్రాషింగ్ జరిగింది. అంతకుముందు 2016 నవంబర్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఆకస్మికంగా రూ. 500 , రూ. 1,000 నోట్లను రద్దు చేసినప్పుడు కూడా ఆర్బీఐ వెబ్‌సైట్ ఇలాగే క్రాష్ అయింది. ఈ ప్రకటనలు ఆ సమయంలో పెట్రోల్ పంపుల్లో, ఏటీఎంల ముందు భారీ క్యూలకు కారణమైంది. తాజాగా రూ. 2000 నోట్లను సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో మార్చుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించింది. ఈ మార్పిడికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని బ్యాంకుల్ని ఆర్బీఐ కోరింది.
ఇవి కూడా చదవండి: