- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాక్‌లో ఉద్యోగులు.. డెలివరీ కంపెనీ కీలక నిర్ణయం!
బెంగళూరు: ప్రముఖ నిత్యావసర వస్తువుల డెలివరీ సేవల సంస్థ, రిలయన్స్ మద్దతున్న డంజో 30 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఖర్చులను తగ్గిస్తూ వ్యాపార కార్యకలాపాలను గాడిలో పెట్టి లాభదాయకతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. తొలగించిన వారిలో అత్యధికంగా ఇంజనీరింగ్ విభాగంలో ఉంటాయని తెలుస్తోంది. అలాగే, వ్యాపార నమూనాను పునర్‌వ్యవస్థీకరిస్తున్నట్టు పేర్కొంది. తొలగింపులకు సంబంధించి కంపెనీ మేనేజర్ల ద్వారా ఉద్యోగులకు తెలియజేసినట్టు స్పష్టం చేసింది.
కాగా, త్వరలో ఐపీఓకు సిద్ధమవుతున్న డంజో వ్యాపారాన్ని లాభాల్లో ఉంచాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే లేఆఫ్స్ ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభం జనవరిలోనూ 3 శాతం ఉద్యోగులను తొలగించింది. కంపెనీ కార్యకలాపాల్లోనూ మార్పు చేసింది. అదే విధంగా సుమారు రూ. 600 కోట్లకు పైగా నిధులను సేకరించింది. సంస్థలోని వాటాదారులకు కన్వర్టబుల్ నోట్ల జారీ ద్వారా నిధులు సమీకరించింది.