మరోసారి ఉద్యోగుల జీతాల చెల్లింపులను ఆలస్యం చేసిన డన్‌జో!

by Vinod kumar |
మరోసారి ఉద్యోగుల జీతాల చెల్లింపులను ఆలస్యం చేసిన డన్‌జో!
X

బెంగళూరు: ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ డన్‌జో మరోసారి ఉద్యోగులకు జీతాల చెల్లింపులను ఆలస్యం చేసింది. ఇప్పటికే నిధుల కొరతను ఎదుర్కొంటున్న డన్‌జో గతవారంలోనే ఉద్యోగులకు జీతాలను చెల్లించనున్నట్టు హామీ ఇచ్చింది. కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ కబీర్ విశ్వాస్ సైతం ఉద్యోగులతో మాట్లాడిన వీడియో కాల్‌లో ఆగష్టు నెలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న జీతాలను ఇచ్చేస్తామని చెప్పారు. అయినప్పటికీ ఆగష్టు జీతాలను చెల్లించడంలో జాప్యం చేసినట్టు సమాచారం.

దీనికితోడు జూన్, జూలై నెలల్లో పెండింగ్‌లో ఉన్న జీతాలను ఇవ్వడంపైనా సరైన తేదీని నిర్ధార్తించకుండా ఆలస్యం చేస్తోంది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న డన్‌జో ఈ ఏడాది జూన్‌లో మేనేజర్ స్థాయి జీతాలను రూ. 75,000కు పరిమితం చేసిన సంగతి తెలిసిందే. ఆ మొత్తాలను జూలైలోనే చెల్లించాల్సి ఉంది. అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న కంపెనీ ఇప్పటివరకు దాదాపు 400 మందిని తొలగించింది.

Advertisement

Next Story

Most Viewed