- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Budget 2025: బడ్జెట్‌పై ఎన్నో డౌట్స్.. నెల లక్ష సంపాదిస్తే ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలా... లేదా?

దిశ, వెబ్ డెస్క్ : Budget 2025: ప్రస్తుతం దేశంలో బడ్జెట్ ఫీవర్ నడుస్తోంది. శనివారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య తరగతి ఉద్యోగులకు భారీ ఊరట కల్పించే విధంగా ప్రకటన చేశారు. రూ. 12లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్నులు విధించబోమని స్పష్టం చేశారు.
రూ. 12లక్షల వరకు ఆదాయం ఉన్నవారు ఒక్క రూపాయి కూడా ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆర్థిక మంత్రి శనివారం 8వ సారి కేంద్ర బడ్జెట్ ను సమర్పించడంతో మధ్య తరగతి వర్గాల్లో ఆనందం నెలకొంది. రూ. 12లక్షల వరకు సాధారణ ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లింపుదారులకు స్లాబ్ రేటు తగ్గింపుల నుంచి ప్రయోజనవంతో పాటు పన్ను రాయితీ అందిస్తామని తెలిపారు. దీంతో వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
కొత్త ఆదాయపు పన్ను విధానంలో రూ. 75వేల స్టాండర్డ్ డిడక్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ మార్పును ప్రవేవపెట్టడంతో రూ. 12. 75లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగిన జీతం పొందే వ్యక్తులు కొత్త పన్ను విధానంలో జీరో ట్యాక్స్ శ్లాబ్ లో ఉంటారు. అయితే వారు పన్ను బాధ్యత లేని ఇతరులతో కలిసి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుందా అనే విషయంలో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాత పన్ను విధానంలో రూ. 2.5లక్షలు కొత్త పన్ను విధానంలో రూ. 4లక్షలు ప్రాథమిక మినహాయింపు పరిమితిని మించి ఆదాయం ఉన్న వ్యక్తులకు ఐటీఆర్ దాఖలు తప్పనిసరి అని నిబంధనలు చెబుతున్నాయి.
ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ బాధ్యతలు ఆదాయ స్థాయిపై ఆధారపడి ఉంటాయి. పన్ను బాధ్యతపై కాదని ట్యాక్స్ నిపుణులు అంటున్నారు. మరో విధంగా చెప్పాలంటే రాయితీలు లేదా తగ్గింపుల కారనంగా పన్ను చెల్లింపుదారుల బాధ్యత సున్నాకి వచ్చినప్పటికీ వారు తప్పనిసరిగా వారి జీరో ట్యాక్స్ ను చూపిస్తూ ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఫైల్ చేయడం అనేది క్లీన్ ఫైనాన్షియల్ రికార్డును నిర్వహించడంలో సహాయపడుతుంది. అలాగే లోన్స్, వీసాలు లేదా ఆర్థిక సేవలు పొందడంలో ప్రయోజనంగా ఉంటుంది.