విమానాల్లో ఇకపై 12 ఏళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రుల పక్కనే సీటు: DGCA

by Disha Web Desk 17 |
విమానాల్లో ఇకపై 12 ఏళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రుల పక్కనే సీటు: DGCA
X

దిశ, బిజినెస్ బ్యూరో: డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. విమానాల్లో ఇకపై 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు, వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులలో కనీసం ఒకరి పక్కన కూర్చునేలా సీటును కేటాయించాలని విమానయాన సంస్థలను కోరింది. ఒకే PNR నెంబర్‌పై ప్రయాణిస్తున్న వారి తల్లిదండ్రులు/సంరక్షకులలో ఒకరి పక్కన పిల్లలకు సీట్లు ఇవ్వాలని, దీనికి సంబంధించిన రికార్డులను నిర్వహించాలని DGCA ఆదేశించింది. ఇటీవల కాలంలో పిల్లలకు వారి తల్లిదండ్రుల పక్కన కాకుండా దూరంగా సీట్లు కేటాయిస్తున్నట్లు డీజీసీఏ దృష్టికి వచ్చింది. దీంతో తాజాగా ఈ కొత్త ఆదేశాలు జారీ చేసింది.

అలాగే విమానయాన సంస్థలకు కొన్ని వెసులుబాట్లు కూడా అందించింది. జీరో బ్యాగేజీ, సీటింగ్ ప్రాధాన్యం, భోజనం, పానీయాలు, సంగీత వాయిద్యాలు తీసుకెళ్లడానికి వంటి సేవలకు కూడా చార్జీలను వసూలు చేసుకోవడానికి అనుమతించింది. అయితే, ఈ సేవలు ఐచ్ఛికంగా మాత్రమే ఉండాలని, తప్పనిసరి కాదని డీజీసీఏ స్పష్టం చేసింది. దీనికోసం ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్క్యులర్ (ATC)-01ని షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్స్ ద్వారా అన్‌బండిల్ ఆఫ్ సర్వీసెస్, ఫీజు పేరుతో సవరించింది. అలాగే, బయలుదేరే ముందు వెబ్ చెక్-ఇన్ సమయంలో ప్రయాణికుడు తనకు నచ్చిన సీటును ఎంచుకోవచ్చు, అయితే ఏ సీటును ఎంచుకోని వారికి ఆటో సీటు కేటాయింపు వర్తిస్తుందని పేర్కొంది.



Next Story

Most Viewed