- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
1946 నుంచి 2023 వరకు జరిగిన నోట్ల రద్దు వివరాలు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 'క్లీన్ నోట్ పాలసీ' లో భాగంగా మే 19న రూ. 2,000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. నోట్లను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి ప్రజలకు సెప్టెంబర్ 30 వరకు ఆర్‌బీఐ టైం ఇచ్చింది. ఇంతకుముందు కూడా నవంబర్ 8, 2016 న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం భారత్‌కు మొదటిసారి కాదు. గత 76 సంవత్సరాలలో, సెంట్రల్ బ్యాంక్ అనేక సందర్భాల్లో కరెన్సీ నోట్లను రద్దు చేసింది/ఉపసంహరించుకుంది.
1946లో చింతామన్ ద్వారకానాథ్ దేశ్‌ముఖ్ RBI గవర్నర్‌గా ఉన్న సమయంలో రూ.500, అంతకన్నా ఎక్కువ విలువ కలిగిన రూ.1000, రూ.10,000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ రెండు ఆర్డినెన్స్‌లు జారీ అయ్యాయి. 1978లో రూ. 1,000, రూ. 5,000, రూ. 10,000 నోట్లు రద్దు చేయబడ్డాయి. 2014లో 2005కి ముందు జారీ చేసిన అన్ని నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ చెప్పింది. 2005కి ముందు ముద్రించిన కరెన్సీ నోట్లు తక్కువ భద్రతా లక్షణాలను కలిగి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ప్రధానంగా ఇలా నోట్ల రద్దు కారణంగా అక్రమ నల్లధనాన్ని అరికట్టవచ్చని ప్రభుత్వం భావన.
Also Read..