DA: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. సెప్టెంబర్‌లో డీఏ పెంపు: నివేదిక

by Harish |   ( Updated:2024-08-23 09:16:10.0  )
DA: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. సెప్టెంబర్‌లో డీఏ పెంపు: నివేదిక
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్‌ నెలలో డియర్‌నెస్ అలవెన్స్‌ను కేంద్రం పెంచే అవకాశం ఉందని సీఎన్‌బీసీ-టీవీ 18 నివేదిక శుక్రవారం పేర్కొంది, ఈ సారి దాదాపు 3 శాతం పెరగవచ్చని తెలుస్తుంది. దీంతో డీఏ 53 శాతానికి చేరుతుంది. ఇప్పటివరకు ఇది 50 శాతంగా ఉంది. కేంద్రం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లయితే డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్).. ఇది పెన్షనర్లకు, డియర్‌నెస్ అలవెన్స్(డీఏ).. ప్రభుత్వ సిబ్బందికి పెంపు వర్తిస్తుంది.

అయితే ఇప్పటి వరకు ఉద్యోగులకు 18 నెలల బకాయిలు అందలేదు. వీటి విడుదలపై ఉద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నిలిపివేసిన ఈ బకాయిలు కనీసం ఈ సారి అయిన అందుతాయని భావించినప్పటికీ నివేదిక మాత్రం బకాయిలను కేంద్రం విడుదల చేయకపోవచ్చని పేర్కొంది. చివరిసారిగా మోడీ ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో మార్చి 7న కరువు భత్యం పెంపును ప్రకటించింది. ఈ పెంపు జనవరి 1, 2024 నుండి అమలులోకి వచ్చింది. ఆ సమయంలో డీఏ 50 శాతానికి చేరింది.

డీఏ, డీఆర్ పెంపు అనేది ఏడాదిలో రెండు సార్లు ఉంటుంది. ఒకటి ఏడాది ప్రారంభం జనవరిలో రెండవది జులై నెలలో ఉంటుంది. జనవరిలో జరగాల్సిన డీఏ పెంపు మార్చ్ నెలలో 4 శాతం పెంపుతో ప్రకటన వెలువడింది. దాంతో డీఏ 50 శాతానికి చేరుకుంది. డీఆర్ కూడా 4 శాతం పెరిగింది. ప్రారంభంలో, డీఏ ఇంక్రిమెంట్ మూల సంవత్సరం 2001తో వినియోగదారు ధరల సూచికను ఉపయోగించి లెక్కించారు. అయితే, సెప్టెంబర్ 2020 నుండి, డీఏను గణించడం కోసం ప్రభుత్వం 2016 ఆధార సంవత్సరంతో కొత్త వినియోగదారు ధర సూచికను తీసుకుంది.

Advertisement

Next Story

Most Viewed