Credit card : క్రెడిట్ కార్డు బిల్లు ఎక్కువగా చెల్లిస్తున్నారా..? ఇక ఆ ఛాన్స్ లేదు

by Harish |   ( Updated:2023-09-15 15:22:08.0  )
Credit card : క్రెడిట్ కార్డు బిల్లు ఎక్కువగా చెల్లిస్తున్నారా..? ఇక ఆ ఛాన్స్ లేదు
X

దిశ, వెబ్‌డెస్క్: క్రెడిట్ కార్డు వాడకం ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోయింది. తమ అవసరాలకు క్రెడిట్ కార్డును వాడుకుని తదుపరి విడతల వారీగా చెల్లింపులు చేయడానికి సులభంగా ఉంటుందని ప్రజలు ఎక్కువగా క్రెడిట్ కార్డును ఉపయోగిస్తుంటారు. అయితే బిల్లు చెల్లింపులు చేసే సమయంలో చాలా మంది బిల్లు ఎంతవరకు ఉందో అంత అమౌంట్ తిరిగి చెల్లిస్తుండగా, మరికొంత మంది బిల్లు కంటే తక్కువగా చెల్లిస్తుంటారు.

అయితే ఇంకొంత మంది మాత్రం అసలు బిల్లు కంటే ఎక్కువగా చెల్లిస్తున్నారు. ఇలాంటి వారి పట్ల బ్యాంకులు ఒక కీలక నిర్ణయానికి వచ్చాయి. క్రెడిట్ కార్డు బిల్లు మొత్తం ఎంత ఉందో అంతవరకు మాత్రమే బిల్లు చెల్లింపులు చేయాలని అంతకంటే ఎక్కువ చెల్లింపులు చేయడానికి వీలు లేదని బ్యాంకులు పేర్కొన్నాయి. దీనికోసం తాజాగా కొత్త సిస్టంను తెచ్చాయి. బిల్లు మొత్తం కంటే ఎక్కువగా చెల్లిస్తే, అదనంగా కట్టిన అమౌంట్‌ను తిరిగి వారికే చెల్లించనున్నాయి.

ఇటీవల కాలంలో వినియోగదారులు తదుపరి నెల మరింత ఎక్కువగా బిల్లు చెల్లించాల్సి వస్తుందని, క్రెడిట్ లిమిట్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తగా ప్రస్తుత నెలలోనే ఎక్కువగా పేమెంట్ చేస్తున్నారు. దీంతో మనీలాండరింగ్, మోసాలు జరుగుతున్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. వివిధ అకౌంట్లలో దొంగలించిన డబ్బును క్రెడిట్ కార్డులకు పంపిస్తూ, తద్వారా విదేశీ లావాదేవీలకు వాడుతున్నారు. దీంతో అప్రమత్తమైన బ్యాంకులు మోసాల కట్టడికి ఈ నిర్ణయానికి వచ్చాయి.

ఈ మోసాల పట్ల ముందే అప్రమత్తమైన కొన్ని బ్యాంకులు క్రెడిట్ బిల్లు కంటే ఎక్కువగా చెల్లింపులు చేయకుండా కట్టడి చేయడానికి కొత్త నిబంధనలు తెచ్చాయి. HDFC,SBI వంటి బ్యాంకులు వారి యాప్‌ల ద్వారా అధికంగా క్రెడిట్ బిల్లు చెల్లింపులు చేయకుండా నిరోధిస్తున్నాయి. ఇదే బాటలో మరిన్ని బ్యాంకులు కూడా కొత్త నిబంధనలు అమలు చేయాలని చూస్తున్నాయి. కాబట్టి ఇకమీదట క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల సమయంలో అధికంగా కాకుండా బిల్లుకు సరిపడా చెల్లింపులు చేస్తే చాలు అని బ్యాంకులు పేర్కొంటున్నాయి.

Read More : 5 ఏళ్లలోపు పిల్లలకు ఆధార్ కార్డు ఎలా..? ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు..

Advertisement

Next Story