- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భారత్‌లో కొత్త తయారీ కార్యకలాపాలు ప్రకటించిన సిస్కో!

న్యూఢిల్లీ: అంతర్జాతీయ నెట్‌వర్క్ పరికరాల తయారీ దిగ్గజం సిస్కో భారత్‌లో భారీ పెట్టుబడులను ప్రకటించింది. వచ్చే కొన్నేళ్లలో దేశీయంగా ఉత్పత్తితో పాటు ఎగుమతుల్లో 1 బిలియన్ డాలర్లు(రూ. 8,200 కోట్లు) పెట్టుబడి పెట్టాలని కంపెనీ భావిస్తోంది. భారత మార్కెట్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని, దాన్ని సాధించేందుకు దేశంలో కొత్త తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తామని సిస్కో సీఈఓ చక్ రాబిన్స్ భారత పర్యటన సందర్భంగా ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం సిస్కో దేశీయంగా టెస్టింగ్, డెవలప్‌మెంట్, లాజిస్టిక్స్, మరమ్మత్తు కార్యకలాపాలను విస్తరించే పనిలో ఉంది. సరఫరాను పెంచి, తయారీ సమయాన్ని తగ్గించి, వినియోగదారుల సంతృప్తిని పెంచడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతిచ్చే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో కొత్తగా తయారీ చేపట్టిన ఏడాదిలోనే దేశీయంగానే కాకుండా ఎగుమతులను కూడా అదే స్థాయిలో నిర్వహించాలనే లక్ష్యాన్ని నిర్దేశించాం. వాస్తవానికి యూరప్‌కు చేసే ఎగుమతులకు భారత తయారీ కార్యకలాపాలను గ్లోబల్ మాన్యూఫక్చరింగ్ నోడ్‌గా వినియోగిస్తామని చక్ రాబిన్స్ వెల్లడించారు.