యాడ్స్‌లో చేసే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!

by Harish |
యాడ్స్‌లో చేసే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!
X

న్యూఢిల్లీ: ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన కమర్షియల్ యాడ్స్‌లో వినియోగదారులను తప్పుదారి పట్టించకుండా ఉండేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్ల కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. ఆయా ఇన్‌ఫ్లుయెన్సర్లు సంబంధిత ఉత్పత్తులు, సేవల యాడ్స్ ఎందుకు చేస్తున్నారనే అంశాన్ని తెలిపేలా ప్రచారం చేయాలని సూచించింది. అందుకోసం 'ఎండార్స్‌మెంట్ నో-హౌ' అనే పేరుతో ప్రభుత్వం మార్గదర్శకాలను తీసుకొచ్చింది.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు చేసిన యాడ్స్‌లోని కంపెనీల ఉత్పత్తులు, సేవల వల్ల ప్రయోజనాలు ఉండట్లేదని వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు చట్ట విరుద్ధంగా ఉండే యాడ్స్‌లను నిలువరించేందుకు ఈ నిబంధనలు దోహదం చేస్తాయని వినియోగదారుల వ్యవహారాల విభాగం తెలిపింది.

నిబంధనల ప్రకారం, సెలబ్రిటీ, ఇన్‌ఫ్లుయెన్సర్లు సొంతంగా వాడకుండా ఏ ఉత్పత్తికి ప్రచారం ఇవ్వకూడదు. అలా చేయగా తాము ఎదుర్కొన్న అనుభవాలను యాడ్స్‌లో తెలియజేయాలి. అలాగే, సదరు ఉత్పత్తుల యాడ్స్‌లో ఎందుకు చేస్తున్నారో చెప్పాలి. లైవ్‌లో అలాంటి ప్రచారం చేస్తుంటే గనక స్క్రీన్‌పైన డిస్‌ప్లే అయ్యేలా చూపడంతో పాటు హ్యాష్‌ట్యాగ్ రూపంలో చూపాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed