- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనలను సవరించిన కేంద్రం!
న్యూఢిల్లీ: రాజకీయ ప్రముఖుల(పీఈపీ) ఆర్థిక లావాదేవీలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రికార్డు చేయడం తప్పనిసరి చేస్తూ ద్రవ్య నిరోధక చట్టంలోని నిబంధనలను కేంద్రం సవరించింది. అలాగే, ఆర్థిక సంస్థలు లేదా రిపోర్టింగ్ ఏజెన్సీలు మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) నిబంధనల ప్రకారం లాభాపేక్ష లేని సంస్థలు లేదా ఎన్‌జీఓల ఆర్థిక లావాదేవీల గురించి సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది.
సవరించిన పీఎంఎల్ నిబంధనల ప్రకారం, ఆర్థిక మంత్రిత్వ శాఖ పీఈపీల కింద సీనియర్ రాజకీయ నాయకులు, సీనియర్ ప్రభుత్వ లేదా న్యాయ, సైనికాధికారులు, రాష్ట్ర సీనియర్ అధికారులు సహా ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులను చేర్చింది. ఆర్థిక సంస్థలు తమ ఎన్‌జీఓ ఖాతాదారుల వివరాలను నీతి ఆయోగ్‌కు చెందిన దర్పన్ పోర్టల్‌లో నమోదు చేయాలి. క్లయింట్, రిపోర్టింగ్ సంస్థ మధ్య వ్యాపార సంబంధాలు ముగిసిన తర్వాత లేదా ఖాతా మూసేసిన ఐదేళ్ల పాటు రికార్డును నిర్వహించాల్సి ఉంటుంది.
అలాగే ఈ వివరాల రికార్డులను నిర్వహించడమే కాకుండా వాటిని కోరినప్పుడు ఈడీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సంస్థలు తమ క్లయింట్ల గుర్తింపును సూచించే కేవైసీ వివరాలు, పత్రాల రికార్డులతో పాటు అకౌంట్ ఫైల్‌లు, రూ. 10 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీల రికార్డులతో సహా అన్ని లావాదేవీల రికార్డును నిర్వహించాల్సి ఉంటుందని సవరణలు చెబుతున్నాయి. అదేవిధంగా వారి క్లయింట్ల నమోదు చేసిన ఆఫీస్ చిరునామా, ప్రధాన వ్యాపార స్థలం వివరాలను సేకరించాల్సి ఉంటుంది.