నిర్మలమ్మ బడ్జెట్ ఎఫెక్ట్.. షేర్ మార్కెట్లు ఢమాల్

by D.Reddy |   ( Updated:2025-02-01 08:06:58.0  )
నిర్మలమ్మ బడ్జెట్ ఎఫెక్ట్.. షేర్ మార్కెట్లు ఢమాల్
X

దిశ, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Markets) సూచీలు శనివారం ఉదయం లాభాల్లో ప్రారంభయ్యాయి. అయితే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత దారుణంగా కుప్పకూలాయి. సెన్సెక్స్ ఒకానొక సందర్భంలో 300 పాయింట్లు పడిపోయింది. అలాగే నిఫ్టీ కూడా నిఫ్టీ 98 పాయింట్ల నష్టంతో కదలాడుతోంది. ఇక బడ్జెట్‌లో పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయంసమృద్ధి పథకం ప్రకటించడంతో అగ్రి స్టాక్స్‌ రాణించాయి. క్లీన్‌టెక్‌ మిషన్‌ కింద సోలార్‌, ఈవీ, బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు ప్రకటించడంతో ఆయా రంగాల షేర్లు రాణించాయి. బీమా రంగంలో ప్రస్తుతం 74 శాతంగా ఉన్న FDIని 100 శాతానికి పెంచడంతో స్టార్ హెల్త్‌ షేర్లు ఊపందుకున్నాయి. కానీ, బడ్జెట్ ముగిసే సమయానికి తీవ్ర నష్టాల్లోకి జారుకున్నాయి.

Next Story