UPI transactions: చిన్న వ్యాపారాలకు ఊరట.. రూ.2,000 వరకు యుపిఐ లావాదేవీల ప్రోత్సాహకాలకు కేబినెట్ ఆమోదం

by Vennela |
UPI transactions: చిన్న వ్యాపారాలకు ఊరట.. రూ.2,000 వరకు యుపిఐ లావాదేవీల ప్రోత్సాహకాలకు కేబినెట్ ఆమోదం
X

దిశ,వెబ్‌డెస్క్: UPI transactions: కేంద్ర ప్రభుత్వం రూ.1,500 కోట్ల ప్రోత్సాహక పథకాన్ని 2024 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. చిన్న వ్యాపారులను డిజిటల్ లావాదేవీలకు మరింతగా ప్రోత్సహించేందుకు రూపొందించిన ఈ పథకం, రూ.2,000 లోపు ఉన్న UPI లావాదేవీలపై 0.15% ప్రోత్సాహకాన్ని అందజేస్తుంది. దీనితో, చిన్న వ్యాపారులు ఎలాంటి ట్రాన్సాక్షన్ ఛార్జీల భారాన్ని లేకుండా UPI వాడుకోవచ్చు. అంతేకాదు, Zero MDR (Merchant Discount Rate) విధానం అమల్లో ఉండటంతో, వ్యాపారులు ఎటువంటి అదనపు ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉండదు.

ఈ పథకం వల్ల దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారులు డిజిటల్ లావాదేవీలను విస్తృతంగా అంగీకరించేందుకు ప్రోత్సాహం లభిస్తుంది. చిల్లర వ్యాపారాలు, చిన్న దుకాణదారులు, టీ కొట్టు, కిరాణా షాపులు వంటి వ్యాపారాలు దీనివల్ల ప్రత్యక్ష ప్రయోజనాన్ని పొందుతాయి. వినియోగదారులు కూడా ఎటువంటి అదనపు ఛార్జీలను చెల్లించకుండా UPI ద్వారా చెల్లింపులు చేయగలరు. ప్రభుత్వ అంచనాల ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 8,839 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. ఈ సంఖ్య 2023-24 నాటికి 18,737 కోట్లకు పెరిగింది. UPI ఉపయోగం 46% పెరిగింది, అంటే 2021-22లో 4,597 కోట్ల లావాదేవీలు జరిగినా, 2023-24 నాటికి 13,116 కోట్లకు పెరిగాయి. ఈ వృద్ధిలో చిన్న వ్యాపారులు కీలక పాత్ర పోషించారని ప్రభుత్వం చెబుతోంది.

ప్రోత్సాహక నిధుల పంపిణీ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 80% నిధులను ప్రతి త్రైమాసికానికి బ్యాంకులకు నేరుగా చెల్లిస్తారు. మిగిలిన 20% మొత్తాన్ని బ్యాంకుల సేవా ప్రమాణాలను బట్టి విడుదల చేస్తారు. బ్యాంకుల టెక్నికల్ డిక్లైన్ రేట్ 0.75% కంటే తక్కువగా ఉంటే 10% అదనపు బోనస్, అలాగే సిస్టమ్ అప్‌టైమ్ 99.5% కంటే ఎక్కువగా ఉంటే మరో 10% బోనస్ అందజేయనున్నారు.

ఈ పథకంతో చిన్న వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను విస్తృతంగా స్వీకరించేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు ఉపయోగదారులు ఎలాంటి అదనపు ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేకుండా రూ.2,000 లోపు UPI లావాదేవీలు చేయవచ్చు

Next Story