- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బడ్జెట్‌లో పన్ను రాయితీలు ఆశిస్తున్న మహిళా పారిశ్రామికవేత్తలు
దిశ, బిజినెస్ బ్యూరో: ఎన్నికల ఏడాది కావడంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న వచ్చే ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే పన్ను మినహాయింపులు మొదలుకొని ప్రోత్సాహకాలు, కేటాయింపుల కోసం పెద్ద ఎత్తున వినతులు చేరాయి. ఈ క్రమంలో స్వయంగా ఆర్థిక మంత్రి మహిళ కావడంతో, దేశంలోని మహిళా పారిశ్రామికవేత్తలకు ఎలాంటి మద్దతు ఇవ్వనున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. గత బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి మహిళల కోసం ప్రత్యేక ఎఫ్‌డీ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మహిళా పారిశ్రామికవేత్తలకు పన్ను సడలింపులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. రాబోయే బడ్జెట్‌లో మహిళా పారిశ్రామికవేత్తలకు పన్ను రాయితీలు కల్పించడంతో పాటు ఉద్యోగాలు చేసే తల్లులకు వేతనంతో కూడిన ఎక్కువ సెలవులను కల్పించే అంశాలపై దృష్టి సారించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఛైర్‌పర్సన్ రాధికా దాల్మియా సైతం ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రీ స్వాస్థ్య బీమా యోజన కింద భృతిని పెంచడం, బాలికలకు విద్యా ప్రయోజనాలను పెంచే అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.
Read More..