- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ-సిమ్ సపోర్ట్‌తో మొదటి వాచ్ విడుదల చేసిన బోట్
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఎలక్ట్రానిక్ వేరబుల్స్ బ్రాండ్ 'బోట్' సరికొత్త వాచ్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కొత్త జనరేషన్ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ-సిమ్‌ను సపోర్ట్ చేసే మొట్టమొదటి స్మార్ట్‌వాచ్‌ను బోట్ సంస్థ తీసుకొచ్చింది. 'లూనార్ ప్రో ఎల్‌టీఈ' పేరుతో లాంచ్ చేసిన ఈ వాచ్ ధర రూ. 9,999గా నిర్ణయించినట్టు బోట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ-సిమ్ సదుపాయం కోసం ప్రత్యేకంగా కంపెనీ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇప్పటికే అమ్మకాలు ప్రారంభమయ్యాయని, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అధికారిక వెబ్‌సైట్ నుంచి లూనార్ ప్రో ఎల్‌టీఈ స్మార్ట్‌వాచ్‌ను కొనేందుకు వీలున్నట్టు బోట్ తెలిపింది. ఈ-సిమ్ సౌకర్యం ఉన్న కారణంగా ఈ స్మార్ట్‌వాచ్ నుంచి కాల్స్, మెసేజ్‌లు పంపవచ్చని, ఇది 1.39 అంగుళాల అమోల్‌డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అలాగే జీపీఎస్ సదుపాయం, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌తో పాటు సాధారణ స్మార్ట్‌వాచ్‌లలో ఉండే యాక్టివిటీ ట్రాకింగ్, ఎస్‌పీఓ2, హార్ట్‌రేట్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్‌తో వచ్చిన ఈ వాచ్ 577ఎంఏహెచ్ బ్యాటరీ ద్వారా ఒక్కసారి ఛార్జింగ్ చేసిన తర్వాత 7 రోజుల వరకు పనిచేయన్నట్టు కంపెనీ పేర్కొంది.