మూడేళ్లలో రెట్టింపు ఆదాయమే లక్ష్యంగా 'బెన్‌క్యూ'!

by Manoj |
మూడేళ్లలో రెట్టింపు ఆదాయమే లక్ష్యంగా బెన్‌క్యూ!
X

న్యూఢిల్లీ: ప్రముఖ టెక్నాలజీ ఉప్తత్తులు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ 'బెన్‌క్యూ' భారత్‌లో రాబోయే మూడేళ్లకు రెండు రెట్ల ఆదాయ వృద్ధిని సాధించనున్నామని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా మహమ్మారి తర్వాత డిస్‌ప్లే ఉత్పత్తులకు భారీగా గిరాకీ ఏర్పడిందని, విద్యా రంగంతో పాటు ఇతర సంస్థల నుంచి అవకాశాలు పెరుగుతున్నాయి, దీనివల్ల మూడేళ్ల నాటికి రూ. 1,000 కోట్ల ఆదాయాన్ని సాధించగలమనే లక్ష్యంతో ఉన్నామని బెన్‌క్యూ ఇండియా మెనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ సింగ్ చెప్పారు.

వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా వినియోగదారుల నుంచి మానిటర్లు, గేమర్‌ల నుంచి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ హెచ్‌డీ మానిటర్లకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉందని, అలాగే హోమ్ ప్రొజెక్టర్‌లకు కూడా డిమాండ్ అత్యధికంగా ఉందని, ఆయా ఉత్పత్తులకు మరింత ఆదరణ లభించడం ద్వారా వచ్చే మూడేళ్లలో 50 శాతానికి పైగా వృద్ధి ఉండనున్నట్టు అంచనా వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా బెన్‌క్యూ ఇండియా దేశీయంగా బీ2బీ విభాగంలో వృద్ధి గణనీయంగా ఉంటుందని, ప్రభుత్వం స్మార్ట్ క్లాస్‌రూమ్ ప్రాజెక్టులకు మారుతుండటం ఈ విభాగం వృద్ధికి అవకాశం ఉంటుంది. ఈ ఏడాది చివరి నాటికి కాంట్రాక్ట్ తయారీ ద్వారా భారత్‌లో తన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల తయారీని స్థానికంగా చేపట్టనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed