Bank Holidays In February: ఫిబ్రవరిలో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే.. జాబితా ఇదే

by Vennela |
Bank Holidays In February: ఫిబ్రవరిలో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే.. జాబితా ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: Bank Holidays In February: ఇంకో నాలుగు రోజుల్లో ఫిబ్రవరి( February) నెల ప్రారంభం కాబోతోంది. మిగిలిన నెలల మాదిరి కాకుండా ఈ నెలలో అతి తక్కువగా 28 రోజులు మాత్రమే ఉంటాయి. అయితే ఈ 28 రోజుల్లో సగం రోజులు బ్యాంకులకు(Bank Holidays) సెలవులు ఉన్నాయి. మన దేశంలో బ్యాంకులను నియంత్రించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఫిబ్రవరి 2025లో ఎన్ని రోజులు బ్యాంకులు మూసీ ఉంటాయన్న జాబితాను విడుదల చేసింది.

ఫిబ్రవరి నెలలో బ్యాంకు సెలువులు (Bank Holidays) 02వ తేదీ ఆదివారంతో ప్రారంభం అవుతాయి. సరస్వతి పూజ, మహాశివరాత్రిMahashivratri) వంటి పండగలతోపాటు ఛత్రపతి శివాజీ జయంతి(Chhatrapati Shivaji Jayanti), మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అవతరణ దినోత్సవాలు వంటి సందర్భాలు ఈ నెలలోనే వస్తున్నాయి. ఈ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్(Reserve Bank Guidelines) ప్రకారం దేశంలోని అన్ని షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు ఆదివారాలతో పాటు రెండో, నాలుగో శనివారం రోజుల్లో మూతబడి ఉంటాయి.

బ్యాంకు సెలువుల జాబితాను మీరు సేవ్ చేసుకుని పెట్టుకున్నట్లయితే మీ ఏరియాలో బ్యాంకులు ఫిబ్రవరి నెలలో ఎన్ని రోజులు, ఏయే రోజుల్లో పనిచేయవో మీకే తెలుస్తుంది. సెలువులు పోగా పనిదినాలకు అనుగుణంగా మీ బ్యాంక్ పనులను పూర్తి చేసుకోవచ్చు.

అయితే బ్యాంకుల సెలవులు అన్నిరాష్ట్రాలకు ఒకే విధంగా ఉండవు. ప్రాంతాన్ని బట్టి సెలవులు మారుతుంటాయి.

బ్యాంకు సెలవుల జాబితా ఇదే : (Here is the list of bank holidays:)

ఫిబ్రవరి 02, ఆదివారం - బ్యాంకులకు ఆదివారం వారం సెలవు

ఫిబ్రవరి 03, సోమవారం - సరస్వతి పూజ..అగర్తలాలో బ్యాంకులకు సెలువ.

ఫిబ్రవరి 08, శనివారం - రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు హాలిడే

ఫిబ్రవరి 09, ఆదివారం - బ్యాంకులకు ఆదివారం వారం సెలవు

ఫిబ్రవరి 11, మంగళవారం - థాయ్ పూసం.. చెన్నైలో బ్యాంకులు మూతబడతాయి

ఫిబ్రవరి 12, బుధవారం - శ్రీ రవిదాస్ జయంతి ..సిమ్లాలో బ్యాంకులకు హాలిడే

ఫిబ్రవరి 15, శనివారం - ఇంఫాల్‌లో Lui-Ngai-Ni.. బ్యాంకులకు సెలవు

ఫిబ్రవరి 16, ఆదివారం - బ్యాంకులకు ఆదివారం వారం సెలవు

ఫిబ్రవరి 19, బుధవారం - ఛత్రపతి శివాజీ జయంతి.. బేలాపూర్, ముంబై, నాగ్‌పూర్‌లో బ్యాంకులకు హాలిడే

ఫిబ్రవరి 20, గురువారం - మిజోరం & అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల అవతరణ దినోత్సవాల సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో బ్యాంక్‌లు మూతబడతాయి

ఫిబ్రవరి 22, శనివారం - నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు హాలిడే

ఫిబ్రవరి 23, ఆదివారం - బ్యాంకులకు ఆదివారం వారం సెలవు

ఫిబ్రవరి 26, బుధవారం - మహా శివరాత్రి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు

ఫిబ్రవరి 28, శుక్రవారం - లోసార్.. గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులు సెలవులో ఉంటాయి

బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ ఇప్పుడున్న టెక్నాలజీ కారణంగా చాలా బ్యాంకులు సేవలు నిలిచిపోవడం లేదు. యూపీఐ, ఐఎంపీఎస్, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ ఛానెల్స్ ద్వారా ప్రజలు 24గంటలూ ట్రాన్సాక్షన్స్ కొనసాగించవచ్చు.

Advertisement
Next Story

Most Viewed