- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2028లో యాపిల్ ఎలక్ట్రిక్ కారు విడుదల
దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ తన ఎలక్ట్రిక్ కారు విడుదల తేదీని మరోసారి పొడిగించింది. 'ప్రాజెక్ట్ టైటాన్' పేరుతో మొదలైన ఎలక్ట్రిక్ వెహికల్ ప్రాజెక్ట్ ద్వారా యాపిల్ ఈవీని 2028లో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదివరకు 2026లోనే యాపిల్ తన మొదటి ఈవీని తీసుకురావాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. 2015లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ అనేక అవాంతరాలను ఎదుర్కొంది. 2021 నుంచి యాపిల్ వైస్-ప్రెసిడెంట్ కెవిన్ లించ్ ప్రాజెక్ట్ టైటాన్‌కు నాయకత్వం వహించాక, అప్పటినుంచి కంపెనీ ఎలక్ట్రిక్ కారు తయారీ ప్రణాళికలో మార్పులు చేశారు. డ్రైవర్ ప్రమేయం లేకుండా పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీని అమర్చే పనిని ప్రారంభించారు. 2028 నాటికి యాపిల్ కారు ఇతర ఈవీల్లో ముఖ్యంగా టెస్లా కార్లలో ఉండే సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటుందని భావిస్తున్నారు. దీన్ని యాపిల్ లెవేల్ 2 ప్లస్ సిస్టమ్‌గా మార్చారు. దీని ద్వారా టెస్లా కార్లలో ఉండే ఆటోపైలట్ సిస్టమ్‌ను పోలి ఉండేలా డ్రైవర్లు అవసరమైన సమయంలో కారును నియంత్రించగలిగేలా దీన్ని రూపొందించనున్నారు. తాజా పరిణామాలు, వివరాల గురించి యాపిల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. వేగంగా మారుతున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని యాపిల్ తన ఈవీలో కొత్త ఫీచర్లను అమర్చేందుకు విడుదలను పొడిగించినట్టు సమాచారం.