- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండో రౌండ్‌లో మరో 9 వేల మందిని తొలగించనున్న అమెజాన్!
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ ఏడాది జనవరిలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 18 వేల మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 9,000 మందిని తొలగించనున్నట్టు అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ చెప్పారు. రానున్న కొన్ని వారాల వ్యవధిలో ఈ తొలగింపుల ప్రక్రియ ఉండనుంది. రెండో దశలో అమెజాన్ వెబ్ సర్వీసెస్, అడ్వర్టైజింగ్, పీపుల్ ఎక్స్‌పీరియన్స్ టెక్నాలజీ విభాగాల్లో పనిచేస్తున్న వారున్నారని సోమవారం ప్రకటనలో తెలిపారు. గత కొన్నేళ్ల నుంచి కంపెనీ గణనీయమైన సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంది.
అయితే, ఇటీవల నెలకొన్న అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల కారణంగా సిబ్బందిని తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమీప భవిష్యత్తులో మాంద్యం ఉండనుందనే ఆందోళనల కారణంగా ఖర్చు తగ్గింపు ముఖ్యమని, దానికోసం క్లౌడ్, అడ్వర్టైజింగ్ ఇతర విభాగాల్లో ఉన్న ఉద్యోగులు ప్రభావితం కానున్నారని ఆండీ జస్సీ వివరించారు. కాగా, గతవారం ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్ ఈ ఏడాది మొదటి దశలో 10 వేలు, రెండో దశలో 11 వేల మందిని తొలగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో దశ తొలగింపుల జాబితాలో అమెజాన్ కూడా వచ్చి చేరింది.