Amazon Black Friday Sale: అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభం.. ఈ ఫోన్ పై ఏకంగా 50 శాతం డిస్కౌంట్..!

by Maddikunta Saikiran |
Amazon Black Friday Sale: అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభం.. ఈ ఫోన్ పై ఏకంగా 50 శాతం డిస్కౌంట్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆన్​లైన్ షాపింగ్ ప్రియులకు మరో గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్​కార్ట్(Flipkart) ఇటీవలే 'బ్లాక్ ఫ్రైడే సేల్(Black Friday Sale)'ను ప్రకటించగా.. తాజాగా అమెజాన్(Amazon) కూడా ఓ సేల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'బ్లాక్ ఫ్రైడే డీల్స్(Black Friday Deals) పేరుతో దీన్ని ప్రవేశపెట్టింది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు నాలుగు రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుంది. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్ ఫోన్స్(Smart Phones), టీవీలు(TV), ఇతర ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్(Electronics Gadgets), ఫ్యాషన్ ప్రొడక్ట్స్(Fashion products)పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, వన్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది.

బ్లాక్ ఫ్రైడే డీల్స్ సేల్​లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా మొబైల్ పై భారీ డిస్కౌంట్​ లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్​లో ఈ ఫోన్ ధర రూ. 1,24,999గా ఉండగా.. ఈ సేల్​ సమయంలో రూ.74,999కే అందుబాటులో ఉంటుంది. అలాగే యాపిల్ మ్యాక్ బుక్ ల్యాప్‌టాప్‌ను రూ. 59,990కే కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. ఇవేగాక.. ఐక్యూ, వన్ ప్లస్, రియల్ మీ, రెడ్ మీ, టెక్నోకు చెందిన ఫోన్లపై కూడా 40 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed