Amazon: ఈ నెల చివరి వరకు అమెజాన్ క్విక్ కామర్స్ సేవలు ప్రారంభం..!

by Maddikunta Saikiran |
Amazon: ఈ నెల చివరి వరకు అమెజాన్ క్విక్ కామర్స్ సేవలు ప్రారంభం..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో గత కొంత కాలంగా క్విక్ కామర్స్(Quick Commerce) రంగానికి రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ రంగంలో బ్లింకిట్(Blinkit), స్విగ్గీ (Swiggy), జెప్టో(Zepto) వంటి సంస్థలు సేవలు అందిస్తుండగా.. ఇటీవలే ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్(Amazon) కూడా క్విక్ కామర్స్ విభాగంలో ఎంట్రీకి సన్నాహాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈ మంత్ ఎండ్(Month End) వరకు ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్(Amit Agarwal) వెల్లడించారు.

అయితే పైలెట్ ప్రాజెక్ట్(Pilot Project)గా తొలుత ఈ సేవల్ని బెంగళూరు(Bengaluru)లో ప్రారంభిస్తామని, అక్కడ సక్సెస్ అయితే భవిష్యత్తులో ఈ సేవల్ని మరిన్ని నగరాలకు విస్తరిస్తామని సృష్టం చేశారు. క్విక్ కామర్స్ సేవల కోసం ఇప్పటికే స్పెషల్ రిక్రూట్మెంట్(Special Recruitment) చేప్పట్టామని, రోజుకు 1,000 నుంచి 2000 ప్రొడక్ట్(Products)లను డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా అమెజాన్ మొదట 2025లో క్విక్ కామర్స్ సేవల్ని స్టార్ట్ చేయాలని భావించింది. కానీ, మార్కెట్లో రోజుకో కంపెనీ వచ్చి చేరుతుండటంతో తన ప్రయత్నాలను వేగవంతం చేసింది.



Next Story

Most Viewed