అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఆఫర్ ప్రకటించిన ఎయిర్‌టెల్!

by Hamsa |
అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఆఫర్ ప్రకటించిన ఎయిర్‌టెల్!
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో టెలికాం పరిశ్రమలో పోటీ తీవ్రమవుతోంది. ఇప్పటికే దిగ్గజ టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌లు వేగవంతంగా అన్ని ప్రాంతాలకు 5జీ నెట్‌వర్క్ అందించే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎయిర్‌టెల్ పోటీలో ముందుండేందుకు అన్‌లిమిటెడ్ 5జీ డేటాను ఆఫర్ చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది. అన్ని ప్లాన్‌ల డేటా వినియోగంపై ఈ ఆఫర్ ఉంటుందని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. రూ. 239, అంతకంటే ఎక్కువ డేటా ప్లాన్‌లను రీఛార్జ్ చేసుకున్న పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు ఈ అపరిమిత డేటా ప్రయోజనాలను పొందవచ్చు.

ఇటీవల రిలయన్స్ జియో జియో ప్లస్ పేరుతో పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్‌లను ప్రకటించిన తర్వాత, ఎయిర్‌టెల్ ఎక్కువ మొత్తం రీఛార్జ్ చేసుకునే వినియోగదారులను కాపాడుకునేందుకే ఎయిర్‌టెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 5జీ సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్, ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్నవారు ఈ ఆఫర్‌ను వాడుకోవచ్చు. తమ సబ్‌స్క్రైబర్లు రోజూవారీ డేటా లిమిట్ గురించి ఆలోచించకుండా ఇంటర్నెట్ సదుపాయాన్ని వినియోగించేందుకే తాము ఈ ఆఫర్ తీసుకొచ్చామని ఎయిర్‌టెల్ వెల్లడించింది. కాగా, ఎయిర్‌టెల్ ఇప్పటివరకు దేశంలోని 270 నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Advertisement

Next Story