40 లక్షల కొత్త సబ్‌స్క్రైబర్లను సాధించిన ఎయిర్‌టెల్

by S Gopi |
40 లక్షల కొత్త సబ్‌స్క్రైబర్లను సాధించిన ఎయిర్‌టెల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రైవేట్ రంగ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ గతేడాది నవంబర్‌లో భారీ సంఖ్యలో కొత్త సబ్‌స్క్రైబర్లను సాధించింది. సమీక్షించిన నెలలో ఎయిర్‌టెల్ 39.8 లక్షల మంది వినియోగదారులను పొందగా, ఆ తర్వాత 34.5 లక్షల కొత్త కస్టమర్లలో రిలయన్స్ జియో రెండో స్థానంలో ఉంది. ఇక, ఆర్థిక కష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా చాలా రోజుల తర్వాత 9.6 లక్షల మంది 4జీ సబ్‌స్క్రైబర్లను పొందడం విశేషం. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ నవంబర్‌లో 5 లక్షల వినియోగదారులను కోల్పోయింది. సోమవారం టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ డేటాను వెల్లడించిన దాని ప్రకారం, నవంబర్ 30 నాటికి జియో మొత్తం 45.58 కోట్ల వినియోగదారులతో టెలికాం విభాగంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండగా, ఎయిర్‌టెల్ 25.10 కోట్లతో, వొడాఫోన్ ఐడియా 12.5 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Advertisement

Next Story