ఎన్నికల తరువాత 'మేక్ ఇన్ ఇండియా' క్రింద కొత్త పాలసీ!

by Disha Web Desk 17 |
ఎన్నికల తరువాత మేక్ ఇన్ ఇండియా క్రింద కొత్త పాలసీ!
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లోకి పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు, దేశీయంగా యువతకు ఉద్యోగాలు కల్పించడానికి 'మేక్ ఇన్ ఇండియా' కింద విమానాలు, నౌకలు, రైల్వే భాగాల తయారీకి విధానపరమైన ప్రోత్సాహాన్ని అందించడానికి ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందించే పనిని త్వరలో మొదలుపెడుతుందని సంబంధిత వర్గాల సమాచారం. ప్రస్తుతం దేశంలో ఎన్నికల హడావిడి ఉన్న నేపథ్యంలో నాయకులు బిజీగా ఉన్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత ఈ ప్రతిపాదనలను అమల్లోకి తీసుకురావడానికి అధికారులు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని ఒక అధికారి తెలిపారు.

రాబోయే కొత్త పాలసీలో ఈ రంగాలకు ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహకాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఎగుమతులు తగ్గించి దేశీయంగా తయారీని ప్రోత్సహించడానికి కీలక నిర్ణయాలు ఉండనున్నాయి. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల కోసం కూడా ప్రత్యేక ప్రతిపాదనలు ఉన్నాయి. అత్యాధునిక, సాంకేతికంగా ఉన్నతమైన ఉత్పత్తుల తయారీకి భారతదేశాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చే ప్రతిపాదనలు ఉంటాయి. రైలు విడిభాగాల తయారీ, షిప్పింగ్-గ్రేడ్ కంటైనర్‌లను ఉత్పత్తి, భూగర్భ మైనింగ్ పరికరాలు, మెట్రోలు, నౌకలు మొదలగు వాటిని స్థానికంగా ఉత్పత్తి చేయడానికి ప్రోత్సాహం అందిస్తారు. ప్రస్తుతం రూ.1.97 ట్రిలియన్ల వ్యయంతో 14 PLI పథకాలు ఎఫ్‌వై22 నుండి ఐదేళ్లపాటు అమలులో ఉన్నాయి. కొత్త పాలసీతో భారత్ ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధిస్తుందని అధికారులు తెలిపారు.



Next Story

Most Viewed