- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తులం బంగారం ధర 2.06 లక్షల రూపాయలు
దిశ, వెబ్‌డెస్క్: ద్రవ్యోల్బణం కారణంగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రస్తుతం అక్కడ ధరలు ఆకాశాన్నంటాయి. ప్రజలు కనీసం నిత్యావసరాలు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారు. ద్రవ్యోల్బణం 50 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. దీంతో ఫిబ్రవరి నెలలో అక్కడ ధరల సూచీ 31.6 శాతానికి చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో లీటర్ డీజిల్ ధర రూ.280 కి చేరింది.
అదే బంగారం ధరకు వస్తే అక్కడ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర తులానికి రూ.2.06 లక్షలు పలుకుతోందని సమాచారం. ద్రవ్యోల్బణం కారణంగా ధరలు భారీగా పెరిగాయి. పైగా అమెరికా డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి విలువ భారీగా పడిపోయింది. ప్రస్తుతం అమెరికా డాలర్‌తో పాకిస్థాన్ రూపాయి విలువ 280 వద్ద ఉంది. అదే భారత్‌లో తులం బంగారం ధర రూ. 56 వేలకు పైగా ఉంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడానికి పాక్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుంచి షరతులతో కూడిన రుణాన్ని పొందడానికి ఒప్పందం కూడా కుదుర్చుకుంది.