- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బ్రేకింగ్ : అమీర్‌పేట మెట్రోస్టేషన్ పై నుంచి దూకిన యువతి

X
దిశ, బేగంపేట : హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. అమీర్‌పేట మెట్రోస్టేషన్ రెండో అంతస్తు నుంచి ఓ యువతి కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఆ టైంలో టింబర్ డిపోలో పడిపోగా తీవ్ర గాయాలపాలైన ఆమెను 108 వాహనంలో మెట్రో సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. సీఐ సైదులు కథనం ప్రకారం.. హీన (20) ఇంజినీరింగ్ పూర్తి చేసింది.
అమీర్‌పేట్‌లోని ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ ఒక కోచింగ్ సెంటర్‌లో జాబ్ కోర్సు చేస్తుంది. ఈ క్రమంలోనే అమీర్ పేట మెట్రోస్టేషన్ పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం బాధితురాలు బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story