గాదరి కిషోర్‌‌ను ప్రశ్నించాడనే ‘ఓయూ’ నాయకుడిపై దాడి : BSP లింబాద్రి

by Sridhar Babu |
గాదరి కిషోర్‌‌ను ప్రశ్నించాడనే ‘ఓయూ’ నాయకుడిపై దాడి : BSP లింబాద్రి
X

దిశ, జగిత్యాల : ఉస్మానియా యూనివర్సిటీ బహుజన నాయకుడు పాల్వాయి నగేష్‌పై దాడిచేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక బీఎస్పీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు చిర్ర శంకర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

అనంతరం జగిత్యాల ప్రెస్ క్లబ్‌లో ప్రకటన విడుదల చేశారు. ఉస్మానియా విద్యార్థి పాల్వాయి నగేష్‌పై తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచరులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ లింబాద్రి అన్నారు. బహుజన విద్యార్థి నగేష్.. ఎమ్మెల్యే కిషోర్ చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తున్నాడనే తన అనుచరులతో దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ వచ్చాకే దళితులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్ దళిత బంధును అమలు చేస్తుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కిషోర్ తన అనుచరులతో దాడులు చేయించడం దారుణమని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దాడికి ప్రోత్సహించిన ఎమ్మెల్యేపై, అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని లింబాద్రి డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల లక్ష్మణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాధారపు సురేందర్, సదుల్లా, నియోజకవర్గ ఇంచార్జ్ భిరుడుల లక్ష్మణ్‌తోపాటు పలువురు వున్నారు.

Advertisement

Next Story

Most Viewed