సెకెండ్ వేవ్ వల్ల ఆర్థిక రికవరీ ఆలస్యం : బ్రిక్‌వర్క్, ఏడీబీ అంచనా

by Shiva |
సెకెండ్ వేవ్ వల్ల ఆర్థిక రికవరీ ఆలస్యం : బ్రిక్‌వర్క్, ఏడీబీ అంచనా
X

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే పలు దిగ్గజ రేటింగ్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధి అంచనాలను తగ్గించగా, తాజాగా ఈ జాబితాలో ప్రముఖ సంస్థ బ్రిక్‌వర్క్ రేటింగ్స్ చేరింది. ఇదివరకు ఈ సంస్థ భారత వృద్ధి అంచనాను 11 శాతంగా వెల్లడించగా, తాజాగా దీన్ని 9 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కరోనా సెకెండ్ వేవ్ వల్ల సరఫరా సమస్యలు, డిమాండ్ క్షీణత వంటి కీలక సవాళ్లు కొనసాగుతాయని, వ్యాక్సిన్ పంపిణీ మరింత వేగవంతం జరిగి, కరోనాను నియంత్రించే వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని బ్రిక్‌వర్క్ తెలిపింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్య రంగం తీవ్రంగా ప్రభావితమవుతోందని, దీనివల్ల ఆర్థిక రికవరీకి ఆటంకం ఏర్పడినట్టు పేర్కొంది. అలాగే, వ్యవసాయ రంగంపై ప్రతికూల సవాళ్లు ఉండే అవకాశాలు కనిపించడంలేదన్ బ్రిక్‌వర్క్ అభిప్రాయపడింది. 2021-22లో వ్యవసాయ రంగం 3.5 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశాలున్నాయని అంచనా వేసింది.

ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) సైతం 2021-22కి భారత్ వృద్ధి అంచనాను 11 శాతంగా అంచనా వేసింది. కరోనా టీకా పంపిణీ వేగవంతంగా ఉన్న కారణంగా వృద్ధి రేటును సానుకూలంగా అంచనాలను బుధవారం వెల్లడించింది. అలాగే, 2022-23 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాను 7 శాతానికి పరిమితం చేసింది. కరోనా సెకెండ్ వేవ్ వల్ల దేశ ఆర్థిక పునరుద్ధరణను ఆలస్యం చేయవచ్చని ఏడీబీ అభిప్రాయపడింది.

Advertisement

Next Story