Big Breaking News : కొత్త ఎన్నికల చీఫ్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్!

by M.Rajitha |
Big Breaking News : కొత్త ఎన్నికల చీఫ్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్!
X

దిశ, వెబ్ డెస్క్ : భారత ప్రధాన ఎన్నికల చీఫ్ కమిషనర్(Election Cheif Commissionor) ఎవరు అనే దానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. కాగా ప్రస్తుతం భారత ఎన్నికల చీఫ్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న రాజీవ్ కుమార్(Rajeev Kumar) పదవీ కాలం ఫిబ్రవరి 18న ముగియనుంది. తదుపరి సీఈసీ ఎవరు అనే విషయంపై జాతీయ మీడియాలో జోరుగా చర్చలు, వివిధ ప్రచారాలు నడుస్తున్నాయి. అయితే కొత్త చీఫ్ కమిషనర్ కోసం ప్రధాని మోడీ(PM Narendra Modi), లా మినిస్టర్ అర్జున్ మేఘవాల్(Law Minister Arjun Meghawal), లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(LOP Rahul Gandhi) ఈ నెల 17న సమావేశం కానున్నారు. ఎంపిక చేసిన 480 మంది సభ్యుల నుంచి ఐదుగురిని షార్ట్ లిస్ట్ చేయనుండగా.. వారిలో జ్ఞానేష్ కుమార్(Gynesh Kumar) ముందున్నారు. 1988 కేరళ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ జ్ఞానేష్ కుమార్ గతంలో కేంద్రంలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించి, 2024 జనవరి 31న రిటైర్ అయ్యారు. ఇక ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ 2022 మే 15న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed