- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ISRO GSLV F12: కాసేపట్లో నింగిలోకి జీఎస్‌ఎల్వీ-ఎఫ్ 12 రాకెట్ ప్రయోగం
దిశ,వెబ్‌డెస్క్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సన్నద్ధమైంది. ఈ రోజు శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జీఎస్‌ఎల్వీ-ఎఫ్ 12 (GSLV F12) రాకెట్‌ను ఉదయం 10.42 ప్రయోగించనున్నారు. నావిగేషన్ రంగానికి చెందిన ఎన్‌వీఎస్-01 ఉపగ్రహాన్ని నింగిలోకి ఇస్రో పంపనుంది. ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నావిగేషన్ వ్యవస్థను రూపొందించుకుంటోంది. దేశ సరిహద్దులో 1500 కిలో మీటర్ల మేర నావిక్ కవరేజ్ ఉండే విధంగా ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఇప్పటికే 7 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించి నావిగేషన్ వ్యవస్థను పటిష్టపరిచింది.
ఈ సిరీస్‌లో ముందుగా ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్ఎస్-1జి (IRNSS-1G) ఉపగ్రహ సేవలు నిలిచిపోవడంతో ఎన్‌వీఎస్- 1 ఉపగ్రహాన్ని తాజాగా ప్రయోగిస్తోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే 12 సంవత్సరాల పాటు సేవలందించనుంది. ఈ రాకెట్ ద్వారా 2232 కిలోల బరువు గల ఎన్‌వీఎస్-01 నావిగేషన్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.