మంత్రి హరీష్ రావుకు చేదు అనుభవం..

by Disha News Web Desk |
మంత్రి హరీష్ రావుకు చేదు అనుభవం..
X

దిశ, ముషీరాబాద్: ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోత రోహిత్ ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్‌లో ఒపిడి విభాగాన్ని ప్రారంభించేందుకు మంత్రి హరీష్ రావు వస్తున్నారని తెలుసుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు.. నల్లకుంట నాలా బ్రిడ్జ్ వద్ద మెరుపు ఆందోళన చేపట్టారు. మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకుని ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఇదే విధంగా మంత్రులేవరిని తిరగనివ్వమని మోత రోహిత్ హెచ్చరించారు. రాబోయే కాలంలో పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయన్నారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాయిబాబా, ఉదయ భాస్కర్, సోహెల్, వెంకట్, పవన్, హాస్మి, ప్రణీత్, సందీప్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story