BIG BREAKING : రామాంతాపూర్‌లో దారుణం.. తల్లిని కడతేర్చిన తనయుడు

by Shiva |   ( Updated:2024-01-07 03:29:17.0  )
BIG BREAKING : రామాంతాపూర్‌లో దారుణం.. తల్లిని కడతేర్చిన తనయుడు
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని రామాంతాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం కన్నతల్లిని కొడుకు భార్య, స్నేహితులతో కలిసి తల్లిని హతమార్చాడు. రామంతపూర్‌ ప్రాంతంలో సుగుణమ్మ, కొడుకు అనిల్ కోడలు తిరుమల కలిసి నివసిస్తున్నారు. ఈ క్రమంలో వాళ్లు ఉంటున్న ఇల్లు సుగుణమ్మ పేరు మీద ఉండడంతో ఆ ఇల్లుని అమ్మాలని కొడుకు, కోడలు వేధించసాగారు. అందుకు సుగునమ్మ ఒప్పుకోకపోవడంతో భార్య, స్నేహితుడితో కలిసి తన తల్లిని అనిల్ హత్య చేశాడు. అయితే, అంత్యక్రియల సమయంలో బంధువులకు అనుమానం రావడంతో విషయం బయటపడింది. అనంతరం రంగంలోకి దిగిన ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Next Story