- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సదర్మాట్ ప్రాజెక్టుకు బ్రేక్.. కారణం ఇదే!
గోదావరి నదిపై నిర్మిస్తున్న సదర్మాట్- పొన్కల్ ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. ఖానాపూర్, నిర్మల్ నియోజకవర్గాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో ఐదేళ్ల క్రితం సర్కారు నిర్మాణం చేపట్టింది. నిధుల విడుదలలో జాప్యం భూసేకరణ కంప్లీట్ కాకపోవడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. 2018 అక్టోబర్ నాటికి పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు మరో రెండేండ్ల గడువు పెంచిన పెండింగ్ పనులు మొదలు కావడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
దిశ, ఆదిలాబాద్: గోదావరి నదిపై ఖానాపూర్, నిర్మల్ నియోజకవర్గాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో మామడ మండలం పొన్కల్ సమీపంలో 2015లో సర్కారు సదర్మాట్ కొత్త బ్యారేజీ నిర్మాణం ప్రారంభించింది. రూ.365 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల వ్యయం తరువాత మరింత పెరిగింది. 2015లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును 2018 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు నిబంధనలు విధించారు. ఇప్పటికే రూ.210 కోట్ల మేర నిధులు ఖర్చుపెట్టారు. తనకు ఇంకా పెండింగ్ బిల్లులు రావాల్సి ఉందని కాంట్రాక్టర్ చెబుతుంటే… ప్రాజెక్టుకు 30 గేట్లు బిగించిన తర్వాతనే మిగతా బిల్లులు చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. గేట్లు బిగించడంతోపాటు ఇంకా 30 శాతం సివిల్ పనులు మిగిలిపోయి ఉన్నాయి. దీంతో అధికారులు 2020 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని గడువు పెంచారు. అయినప్పటికీ పెండింగ్‌లో పడిన పనులు మొదలు కావడం లేదు. కాంట్రాక్టర్ ఇప్పటికే క్యాంపులు కూడా ఎత్తివేశారు.
భూసేకరణే ప్రధాన అడ్డంకి
సదర్మాట్ ప్రాజెక్టు పనులు పెండింగ్ పడడానికి భూసేకరణే ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం 1176 ఎకరాలు ప్రభుత్వం భూసేకరణకు నిర్ణయించింది. ఇందులో 673 ఎకరాలు ఇప్పటికే సేకరించి రూ.66 కోట్లు నిధులు ఖర్చు చేసింది. మరో 503 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది. ఇందుకు రూ.57 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఈ 57 కోట్లు విడుదలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. నిధుల లేమి కారణంగా ఇప్పట్లో విడుదల కావని, దీంతో ప్రాజెక్టు పనులు పెండింగ్‌లో పడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ పరిణామం రైతుల్లో తీవ్ర నిరాశను నింపుతోంది. తమ విలువైన భూములను తీసుకొని ప్రాజెక్టు పూర్తి చేయక పోవడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. కేవలం 57 కోట్ల నిధుల పెండింగ్ కారణంగా రూ.400 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ప్రాజెక్టు నిలిచిపోవడం బాధాకరమని రైతులు ఆందోళన చెందుతున్నారు.