Encounter: తెలంగాణ సరిహద్దులో కాల్పుల మోత.. కర్రిగుట్ట వైపు కదులుతోన్న మావోయిస్టులు

by Shiva |   ( Updated:2025-04-22 06:31:09.0  )
Encounter: తెలంగాణ సరిహద్దులో కాల్పుల మోత.. కర్రిగుట్ట వైపు కదులుతోన్న మావోయిస్టులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ (Telangana - Chhattisgarh) సరిహద్దులో ఇవాళ తెల్లవారుజాము నుంచి కాల్పుల మోత మోగుతోంది. వెంకటాపురం (Venkatapuram) మండల పరిధిలోని కర్రిగుట్ట (Karrigutta)పై బాంబులు అమర్చామని, అటువైపు ఆదివాసీలు ఎవరూ రావొద్దంటూ ఇటీవలే మావోయిస్టుల (Maoists) నుంచి ఓ లేఖ విడుదలైన విషయం తెలిసిందే. ఇక కర్రిగుట్టల్లో ఓ కీలక నేత నేతృత్వంలో భారీగా మావోయిస్టులు అక్కడ సంచరిస్తున్నారనే సమాచారం మేరకు తెలంగాణ (Telangana), ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల పోలీసుల అధ్వర్యంలో సీఆర్‌పీఎఫ్ బలగాలు ‘బచావో కర్రిగుట్టలు’ పేరుతో భారీ ఆపరేషన్ చేపడుతున్నాయి. అయితే, ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) వైపు నుంచి సీఆర్‌పీఎఫ్ (CRPF) బలగాలు వరుసగా కాల్పులు జరుపుతూ మావోయిస్టులను వెంబడిస్తుండగా.. వారంతా వేగంగా కర్రిగుట్టల వైపు కదులుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే అక్కడ మోహరించిన భద్రతా బలగాలు కర్రిగుట్టలను చుట్టుముట్టాయి. ఈ పరిణామంతో అక్కడ ఏం జరుగుతుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.



Next Story

Most Viewed